China Virus: భయంకరమైన వైరస్ సృష్టించిన చైనా.. సోకితే 3 రోజుల్లోనే మృత్యువాత

China Scientists Created Deadly Virus: చైనా శాస్త్రవేత్తలు మరో డేంజరస్ వైరస్ సృష్టించినట్లు తెలుస్తోంది. ఈ వైరస్ సోకితే మూడు రోజుల్లోనే మరణం సంభవిస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో ప్రపంచ దేశాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : May 29, 2024, 04:11 PM IST
China Virus: భయంకరమైన వైరస్ సృష్టించిన చైనా.. సోకితే 3 రోజుల్లోనే మృత్యువాత

China Scientists Created Deadly Virus: కరోనా వైరస్  ప్రపంచంపై పంజా విసిరింది. ఆ వైరస్ నుంచి కోలుకుని ప్రస్తుతం అంతా సర్దుకుంటున్న సమయంలో మరో మహమ్మారి భయపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కరోనా మహమ్మారి చైనాలో పుట్టి ప్రపంచం మొత్తం వ్యాపించింది. తాజాగా మరో భయంకరమైన విషయం వెలుగులోకి వస్తోంది. చైనా మరోసారి దుస్సాహసానికి  ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ప్రాణంతకర వైరస్‌ను చైనా శాస్త్రవేత్తలు తయారు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ డేంజరస్ వైరస్ సోకితే.. కేవలం మూడు రోజుల్లోనే మరణం సంభవిస్తుందని తెలుస్తోంది. ఈ విషయం బయటకు పొక్కడంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. చైనాలోని హెబీ మెడికల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఎబోలా వైరస్‌ను ఉపయోగించి ఈ కొత్త వైరస్‌ను సృష్టించారు. ఎబోలా వైరస్ మాదిరే శాస్త్రవేత్తల పరిశోధనలు సర్వత్రా తీవ్ర వివాదాస్పదంగా మారాయి.

Also Read: Balakrishna: మోక్షజ్ఞ ఈ హీరోలను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి.. కొడుకుకి బాలకృష్ణ సలహా
 
వ్యాధికారక ప్రభావాలను రీసెర్చ్ చేసేందుకు చైనా శాస్త్రవేత్తలు ఈ వైరస్‌ను సృష్టించినట్లు తెలుస్తుండగా.. ఈ వైరస్ వల్ల కలిగే ప్రమాదం భయాందోళనకు గురి చేస్తోంది. దీని స్వభావం సింథటిక్ అని సైన్స్ డైరెక్ట్‌ ప్రచురితం కావడంతో ఈ వైరస్ గురించి ప్రమాదానికి తెలిసివచ్చింది. ఇది మనిషి శరీరంపై ఎబోలా వైరస్ వంటి ప్రభావాన్నే చూపుతుందని అంటున్నారు. అయితే ఈ రీసెర్చ్ లక్ష్యం మాత్రం వివిధ వ్యాధులను నివారించడం అని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  

2014 నుంచి 2016 మధ్య కాలంలో ఆఫ్రికన్ దేశాలలో ఎబోలా వ్యాప్తి చెందగా.. ఆ వైరస్ బారిన పడి వేలాది మంది మృత్యువాత పడటం సంచలనం రేపిన విషయం తెలిసిందే. అంతటి ప్రమాదకరమైన ఎబోలా వైరస్ నుంచి గ్లైకోప్రొటీన్ (GP)ని స్వీకరించేందుకు వెసిక్యులర్ స్టోమాటిటిస్ వైరస్ (VSV)ని ఉపయోగించినట్లు సైన్స్ డైరెక్ట్‌లో వెల్లడించారు. ఈసారి ముందుగా సిరియన్ హామ్స్టర్స్ అనే జంతు జాతులపై పరిశోధనలు జరిపారు. ఐదు మగ, ఐదు ఆడ జాతులకు ఈ వైరస్‌ను ఎక్కించారు. వీటిలో ఎబోలా వైరస్ వంటి లక్షణాలు కనిపించాయని.. ఈ జంతువులు అన్ని మూడు రోజుల్లోనే మృత్యువాత పడ్డాయని నివేదికలో పేర్కొన్నారు. జంతువుల కళ్లు దెబ్బతిన.. ఆప్టిక్ నరాలపై తీవ్రంగా ప్రభావం చూపించినట్లు తెలిసింది. ఈ ప్రమాదకరమైన వైరస్‌కు అగ్ర రాజ్యాలు కూడా విరుగుడు కనిపెట్టేందుకు తీవ్ర కసరత్తులను ముమ్మరం చేశాయి. చైనాకు చెక్ పెట్టేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. 

Also Read: Realme GT 7 Pro: చూడగానే వావ్‌ అనిపించే డిజైన్‌తో కొత్త Realme GT 7 Pro వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News