బీజింగ్: ప్రపంచానికి కరోనా మహమ్మారిని పరిచయం చేసి ఆపై వైరస్ నుంచి గట్టెక్కామని ఊపిరి పీల్చుకుంది చైనా. కానీ అనూహ్యంగా చైనాలో కరోనా మహమ్మారి తిరగబెట్టింది. అక్కడ మళ్లీ కరోనా కేసులు చాలా వేగంగా నమోదవుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే వూహాన్‌లో కరోనా మరణాలు 50శాతం మేర పెరిగాయి. గురువారం వరకు 2,579 మంది కరోనాతో చనిపోగా.. శుక్రవారం మరో 1290 మంది వైరస్ కాటుకు బలైపోయారని అధికారులు ప్రకటించారు. అక్కడబ్బాయి.. ఇక్కడమ్మాయి.. వాట్సాప్‌లో పెళ్లి!
తాజాగా నమోదైన మరణాలతో కలిపి చైనాలో కరోనాతో బలైపోయిన వారి సంఖ్య 4,632కు చేరుకుంది. కరోనాకు కేంద్రంగా మారిన వూహాన్ నగరంలో ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరగడం తెలిసిందే. అంతకుముందు అక్కడ మాంసం మార్కెట్లు కొన్ని రోజుల నిషేధం తర్వాత తిరిగి ప్రారంభించారు. తమ దేశంలో కరోనా మరణాలు, కేసులపై చైనా వెల్లడిస్తున్న వివరాలపై ప్రపంచ వ్యాప్తంగా సందేహాలు నెలకొన్నాయి. Photos: ఆమె అందాలకు నెటిజన్లు LockDown
కరోనా వైరస్ పుట్టుకొచ్చిన మొదట్లో మెడికల్ సిబ్బంది కొరత, చికిత్స విధానం తెలికకపోవడంతో భారీగా కేసులు, మరణాలు నమోదయ్యాయి. అనంతరం అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవడం మరణాలు తగ్గుముఖం పట్టాయి. అయితే మరణాలు, పాజిటివ్ కేసుల సంఖ్యను కచ్చితంగా చెప్పడానికి కొంత సమయం పట్టిందని ఓ అధికారి వెల్లడించినట్లుగా అక్కడి మీడియా సంస్థ సీజీటీఎన్ ప్రస్తావించింది. ఇప్పటివరకూ ఓ లెక్క.. ఇకనుంచి ఓ లెక్క!
కాగా, అగ్రరాజ్యం అధినేత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం చైనా చర్యలపై మండిపడుతున్నారు. చైనా నాటకాలు ఇకనైనా కట్టిపెట్టాలని, గతంలో వెల్లడించిన 3000 మరణాలపై ఎవరూ విశ్వసించడం లేదంటూ చురకలంటించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
చైనాలో 50 శాతం పెరిగిన కరోనా మరణాలు