China Ship Hits Bridge: పొరపాటున జరిగిన ప్రమాదంలో ఓ బ్రిడ్జి రెండు ముక్కలుగా విరిగిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. పలువురు గాపడ్డారు. ఈ ప్రమాదం చైనా దేశంలో జరిగింది. గ్యాంగ్గూ నగరంలోని పెరల్ నదిపై ఈ సంఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో భారీ ప్రమాదమే తప్పింది. బ్రిడ్జిపై అధిక సంఖ్యలో వాహనాలు లేకపోవడంతో మరణాల సంఖ్య తగ్గింది.
Also Read: Henley Passport Index: దిగజారిన భారతదేశ పాస్‌పోర్ట్ ర్యాంక్.. ఫ్రాన్స్‌కు తిరుగులేదు
పెరల్ నది మార్గంలో ఫోష్‌మన్ నుంచి గ్వాంగ్జూ వైపు ఓ పడవ ప్రయాణం చేస్తోంది. మార్గమధ్యలో పెరల్ నదిపై ఉన్న లిజింగ్షా వంతెన ఎదురైంది. వేగంగా ఉన్న భారీ నౌక బ్రిడ్జిని ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి బ్రిడ్జి రెండు ముక్కలుగా విడిపోయింది. అనంతరం బ్రిడ్జి శిథిలాల మధ్య నౌక చిక్కుకుపోయింది. బ్రిడ్జి విరిగిపోవడంతో బ్రిడ్జిపై ఉన్న వాహనాలు నదిలోకి పడిపోయాయి. బస్సుతోపాటు మిగతా వాహనాలు ఉన్నాయి. ఐదు మంది ఈ ప్రమాదంలో మరణించారు. తెల్లవారుజామున ఘటన చోటుచేసుకోవడంతో భారీ ప్రమాదమే తప్పింది. పగటి పూట ప్రమాదం జరిగి ఉంటే వందల సంఖ్యలో మరణాలు సంభవించే అవకాశం ఉంది. కాగా ఆ నౌక ఖాళీతోనే వెళ్తోందని.. ఎలాంటి సరుకు లేదని పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలను అక్కడి అధికారులు ఆరా తీస్తున్నారు.
Also Read: BAPS Mandir: అబుదాబిలో తొలి మందిరం.. 'బాప్స్' అని ఎందుకు పిలుస్తారు? ఆలయ విశేషాలేమిటి?
చైనాలో రవాణా మార్గాల్లో జల మార్గం ఒకటి. ఆ దేశంలోని నదుల్లో ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. పెరల్ నది పరీవాహక ప్రాంతం చైనాలో అత్యంత రద్దీ ఉండే జల మార్గాల్లో ఒకటి. ఈ మార్గం ద్వారా సరుకుల రవాణాతోపాటు సాధారణ ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. కాగా లిజింగ్షా వంతెనపై గతంలోనే వివాదం సాగుతోంది. నౌక ప్రయణాలకు బ్రిడ్జి అడ్డంగా ఉందని అధికారులు గుర్తించారు. బ్రిడ్జి నిర్మాణంలో మార్పులు చేయాలని అక్టోబర్ 2021లో నిర్ణయించినా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు.
చిక్కుకుపోయిన బ్రిడ్జి
ప్రమాదంలో బ్రిడ్జిని ఢీకొట్టిన నౌక మధ్యలోనే ఆగిపోయింది. బ్రిడ్జి రెండు పిల్లర్ల మధ్య నౌక నిలిచిపోయింది. నౌకను నడుపుతున్న కెప్టెన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా నదిలో చిక్కుకుపోయిన నౌకను ముందుకు కదిలించడానికి అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులతోపాటు నేవీ రంగంలోకి దిగింది. బ్రిడ్జి కూలిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి