పర్యాటక శాఖ ప్రకటనలో "బీఫ్" వంటకం వివాదం

మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా వచ్చిన సెలవుల్లో పర్యాటకులను ఆకర్షించి, ఆ రద్దీని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా కేరళ పర్యాటక శాఖ విడుదల చేసిన ఓ ప్రకటన తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివాదంలోకి నెట్టేసింది. పసందైన వంటకాలతో ఏర్పాటు చేసిన స్పెషల్ హాలీడే ప్యాకేజీలను ఆస్వాదించాల్సిందిగా కోరుతూ కేరళ పర్యాటక శాఖ మకర సంక్రాంతి రోజున ఓ ట్వీట్ చేసింది. అయితే, ఆ ట్వీట్‌లో 'బీఫ్ ఉలర్తియత్తు' అనే బీఫ్ వంటకాన్ని ప్రత్యేకంగా పేర్కొనడంపై భారతీయ జనతా పార్టీ, విశ్వహిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఓవైపు సంక్రాంతి పర్వదినం నాడు హిందువులు గోమాతను పవిత్రంగా భావించి పూజిస్తోంటే.. మరోవైపు అదే రోజున బీఫ్ వంటకాన్ని ప్రత్యేక వంటకంగా వడ్డించనున్నట్టు ప్రకటన ఇవ్వడం ఏంటంటూ బీజేపి, వీహెచ్‌పి ఆగ్రహం వ్యక్తంచేశాయి.

  • Zee Media Bureau
  • Jan 18, 2020, 03:40 AM IST

Video ThumbnailPlay icon

Trending News