Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. సీబీఐ మోపిన అభియోగాల ఆధారంగా... ప్రధానంగా నలుగురి ఖాతాలు, సంస్థల లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది. ఢిల్లీకి చెందిన సమీర్ మహేంద్రుతోపాటు వ్యాపారి అరుణ్ రామచంద్రన్ పిళ్లై, మధ్యవర్తులు అరుణ్ పాండ్య, విజయ్ నాయర్‌ల బ్యాంకు ఖాతాలు, వారికి సంబంధించిన సంస్థల లావాదేవీలపైన ఈడీ ప్రత్యేక బృందాలు ఆరా తీస్తున్నాయి.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. సీబీఐ మోపిన అభియోగాల ఆధారంగా... ప్రధానంగా నలుగురి ఖాతాలు, సంస్థల లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది. ఢిల్లీకి చెందిన సమీర్ మహేంద్రుతోపాటు వ్యాపారి అరుణ్ రామచంద్రన్ పిళ్లై, మధ్యవర్తులు అరుణ్ పాండ్య, విజయ్ నాయర్‌ల బ్యాంకు ఖాతాలు, వారికి సంబంధించిన సంస్థల లావాదేవీలపైన ఈడీ ప్రత్యేక బృందాలు ఆరా తీస్తున్నాయి. ఢిల్లీ కేంద్రంగా రిజిస్టర్ అయిన ఇండో స్పిరిట్ కంపెనీకి సమీర్ మహేంద్రు ఎండీగా వ్యవహరిస్తున్నారు. లిక్కర్ స్కాంలో హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారి పిళ్లై కొన్ని కోట్ల రూపాయలను అరుణ్ పాండ్య, విజయ్ నాయర్‌ల మధ్యవర్తిత్వంతో ఢిల్లీకి చేర్చినట్లు సీబీఐ ఆరోపించింది.