Rs.10 Clinic: హైదరాబాద్‌లో 10 రూపాయల డాక్టర్.. క్యూ కడుతున్న జనం...

Rs.10 Clinic in Neredmet Hyderabad: పేదలకు నిస్వార్ధంగా వైద్య సేవలందించాలనే ఉద్దేశంతో డా.రోజ్‌లైన్, మరికొందరు మిత్రులు కలిసి 'రూ.10 క్లినిక్'ను ప్రారంభించారు. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా నేరేడ్‌మెట్‌ పరిధిలోని అంబేడ్కర్ భవన్‌లో ఈ క్లినిక్‌ని నిర్వహిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 19, 2022, 12:11 PM IST
  • జీహెచ్ఎంసీ పరిధిలోని నేరెడ్‌మెట్‌లో రూ.10 క్లినిక్
  • రూ.10కే సేవలందిస్తున్న డా.రోజ్‌లైన్
  • రోజుకు 15 మంది పేదలకు వైద్య సేవలు
Rs.10 Clinic: హైదరాబాద్‌లో 10 రూపాయల డాక్టర్.. క్యూ కడుతున్న జనం...

Rs.10 Clinic in Neredmet Hyderabad: ఒకప్పుడు డాక్టర్ కన్సల్టేషన్‌కి వెళ్తే కనీసం రూ.100 ఫీజు వసూలు చేసేవారు. రాను రాను ఆ వంద కాస్త రూ.500కి చేరింది. ఇక కార్పోరేట్ ఆసుపత్రుల్లోనైతే రూ.1000 ఫీజు చెల్లించుకోక తప్పదు. కన్సల్టేషన్ ఫీజు, టెస్టులు, మందులు.. అన్నీ కలిస్తే ఖర్చు తడిసి మోపెడవుతుంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇది తలకు మించిన భారం. పోనీ సర్కార్ దవాఖానాకు వెళ్దామంటే అక్కడ సదుపాయాలు, చికిత్స సరిగా ఉంటాయో లేదోనన్న సందేహాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడో చోట పేదల కోసం నిస్వార్థంగా పనిచేసే వైద్యులూ లేకపోలేదు. ఆ కోవలోకే వస్తారు హైదరాబాద్‌కి (Hyderabad) చెందిన డా.రోజ్‌లైన్.

పేదలకు నిస్వార్ధంగా వైద్య సేవలందించాలనే ఉద్దేశంతో డా.రోజ్‌లైన్, మరికొందరు మిత్రులు కలిసి 'రూ.10 క్లినిక్'ను ప్రారంభించారు. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా నేరేడ్‌మెట్‌ పరిధిలోని అంబేడ్కర్ భవన్‌లో ఈ క్లినిక్‌ని నిర్వహిస్తున్నారు. 'నేనెక్కడైతే పుట్టి పెరిగానో.. అదే ప్రాంతంలో కేవలం రూ.10 కన్సల్టేషన్ ఫీజుతో వైద్య సేవలందించడం చాలా సంతోషంగా ఉంది. రోజుకు 15 మంది పేషెంట్లకు ఇక్కడ వైద్య సేవలందిస్తున్నాం. వైద్య పరీక్షలకు సంబంధించి ల్యాబ్ సదుపాయాలను కూడా 50 శాతం తక్కువ ఫీజుకే అందిస్తున్నాం.' అని డా. రోజ్‌లైన్ (Dr.Roseline) వెల్లడించారు. 

నిజానికి మొదట్లో తాను అనుకున్నంత స్థాయిలో చేయలేకపోయానని డా. రోజ్‌లైన్ పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత.. ఇక్కడి ప్రజలకు సేవ చేయడమే తనకు అన్నింటి కన్నా ముఖ్యమనే బలమైన నిర్ణయానికి వచ్చానని తెలిపారు. సాధారణంగా ప్రైవేట్ క్లినిక్స్‌లో ఎంత చిన్న క్లినిక్ అయినా రూ.300 వరకు కన్సల్టేషన్‌కే చెల్లించాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఉన్న డబ్బులన్నీ కన్సల్టేషన్‌కే పెట్టడంతో ఇక మందులు కొనుగోలు చేసేందుకు పేదల వద్ద డబ్బులు ఉండట్లేదన్నారు. అందుకే కేవలం రూ.10కే వైద్య సేవలు అందించడం ద్వారా తమ వద్ద ఉన్న డబ్బుతో వారు మందులు కొనుగోలు చేయగలరని అన్నారు.

ఈ రూ.10 క్లినిక్‌కు స్థానికుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. వినాయక్ నగర్‌కి (Hyderabad) చెందిన జబీన్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. బయట ప్రైవేట్ క్లినిక్స్‌కి వెళ్తే కన్సల్టేషన్‌కే రూ.300 వరకు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల తనకు జ్వరం రావడంతో డా.రోజ్‌లైన్ క్లినిక్‌కి వచ్చానని.. అక్కడ కేవలం రూ.10 మాత్రమే తీసుకున్నారని చెప్పారు. అక్కడ రాసిచ్చిన మందులు కూడా బాగా పనిచేశాయని తెలిపారు. మహమ్మద్ ఫసలుల్లా అనే వ్యక్తి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 

Also Read: Sarkaru vaari paata first review: సర్కారు వారి పాట ఫస్ట్ రివ్యూ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
 

Trending News