TS EAMCET 2022: నేడు తెలంగాణ ఎంసెట్.. వర్షాలతో ప్రత్యేక ఏర్పాట్లు... నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఇవాళ పరీక్షలు జరగనున్నాయి. ఎంసెట్ నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్ష జరగనుంది. ఇంజినీరింగ్ విభాగానికి 18, 19, 20 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి

Written by - Srisailam | Last Updated : Jul 18, 2022, 06:58 AM IST
  • నేడే తెలంగాణ ఎంసెట్
  • మూడు రోజులు ఇంజనీరింగ్ పరీక్షలు
  • నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
TS EAMCET 2022: నేడు తెలంగాణ ఎంసెట్.. వర్షాలతో ప్రత్యేక ఏర్పాట్లు... నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

TS EAMCET 2022: తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఇవాళ పరీక్షలు జరగనున్నాయి. ఎంసెట్ నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్ష జరగనుంది. ఇంజినీరింగ్ విభాగానికి 18, 19, 20 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈసారి ఇంజనీరింగ్ విభాగంలో గతంలో కంటే అప్లికేషన్లు పెరిగాయి. లక్షా 72 వేల 241 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంసెట్ కోసం తెలంగాణ, ఏపీలో కలిపి  మొత్తం 108 సెంటర్లను ఏర్పాటు చేశారు.తెలంగాణలో 89 , ఆంధ్రప్రదేశ్ లో 19 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నెట్ వర్క్ ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎంసెట్ నిర్వహణకు పకడ్బంది ఏర్పాట్లు చేశారు. నిమిషం రూల్ అమలు చేస్తున్నారు, సమయానికి నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్ లోకి ఎంట్రీ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. అభ్యర్థుల డాక్యుమెంట్లను పరిశీలించి, విద్యార్థులను కేంద్రాల్లోనికి పంపిస్తారు. మొబైల్స్ , వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. ఈ జాగ్రత్తలు అభ్యర్థులంతా ఖచ్చితంగా పాటించాలని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ చెప్పారు. అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్ లొకేషన్‌, రూట్‌ను ముందుగానే సరిచూసుకోవాలని సూచించారు. పరీక్ష సమయానికి గంట 15 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ లోకి విద్యార్థులను పంపిస్తారు. పరీక్ష ముగిసిన తర్వాత చిత్తు పేపర్లను కూడా ఇన్విజిలేటర్లకు ఇవ్వాల్సి ఉంటుంది.

భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా ఈ నెల 14, 15 తేదీల్లో జ‌ర‌గాల్సిన అగ్రి, మెడికల్ ఎంసెట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. వాయిదా వేసిన పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 79 వేల 365 దరఖాస్తులు వచ్చాయి.

Also read: Margaret Alva: జగదీప్‌ ధన్‌ఖడ్‌ను ఢీకొట్టనున్న మార్గరెట్ అల్వా..ఇంతకు ఎవరీ మహిళ..

Also read: CICSE 10th Class Results: ఐసీఎస్‌ఈ 'పది' ఫలితాలు విడుదల..రిజల్ట్ ఇలా చూసుకోండి..! 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News