Revanth Reddy: సీఎం కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి ఓపెన్ లెటర్

Coronavirus tests | హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ( Revanth Reddy) బహిరంగ లేఖ రాశారు. కరోనావైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తూ కోవిడ్-19పై యుద్ధం చేస్తోన్న జర్నలిస్టులకు సరైన భద్రత లేకుండాపోయిందని రేవంత్ రెడ్డి తన బహిరంగ లేఖలో (Open letter) పేర్కొన్నారు.

Last Updated : Jun 10, 2020, 11:15 PM IST
Revanth Reddy: సీఎం కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి ఓపెన్ లెటర్

Coronavirus tests | హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ( Revanth Reddy) బహిరంగ లేఖ రాశారు. కరోనావైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తూ కోవిడ్-19పై యుద్ధం చేస్తోన్న జర్నలిస్టులకు సరైన భద్రత లేకుండాపోయిందని రేవంత్ రెడ్డి తన బహిరంగ లేఖలో (Open letter) పేర్కొన్నారు. ఒక్క అక్షరం లక్ష మెదళ్లను కదిలిస్తుంది. ఈ ఒక్క వ్యాఖ్యం చాలు సమాజంలో విలేకరుల పాత్ర ఏమిటి అన్నది చెప్పడానికి. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అనిర్వచనీయం. అత్తెసరు జీతాలు, అర్ధాకలి జీవితాలతో అనుక్షణం ప్రజలకు సమాచారం చేరవేయడమే శ్వాసగా, ధ్యాసగా మీడియా ప్రతినిధులు పని చేస్తున్నారు. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ఉండి, సాహసోపేతంగా విధులు నిర్వహిస్తున్నారు. కష్టకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తాజా పరిస్థితులపై క్షణక్షణం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు మీడియా ప్రతినిధులు కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. యువ విలేకరి మనోజ్ కుమార్ కరోనా సోకి మృతి చెందిన తీరు (Journalist Manoj died of COVID-19) హృదయాన్ని కలచివేసిందని రేవంత్ రెడ్డి ఈ లేఖ ద్వారా అభిప్రాయపడ్డారు. Bonalu festival: బోనాల పండగపై ప్రభుత్వం ప్రకటన )

ఈ నేపథ్యంలో ప్రభుత్వం జర్నలిస్టుల భద్రత విషయంలో తక్షణం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తుచేసిన రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలోని ప్రతి జర్నలిస్టుకి ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రతీ జర్నలిస్టు కుటుంబానికి ఈ సంక్షోభ సమయంలో నెలకు రూ.10 వేలు ఆర్థిక సాయం చేయాలి. ఇటీవల మృతి చెందిన మనోజ్ కుమార్ కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలి. వీటిపై తక్షణం స్పందించాల్సిందిగా సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేస్తున్నానని రేవంత్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. లేనిపక్షంలో జర్నలిస్టు సమాజంలో మీరు మానవత్వం లేని మనిషిగా మగిలిపోతారని హెచ్చరిస్తున్నట్టు రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News