Rave Party: కేటీఆర్‌ బావమరిది ఫామ్‌హౌస్‌లో రేవ్‌ పార్టీ? భారీగా విదేశీ మద్యం, అమ్మాయిలు అరెస్ట్‌

Rave Party KTR Brother In Law Farm house: మాజీ మంత్రి కేటీఆర్‌ బావ మరిది ఫామ్‌హౌస్‌లో రేవ్‌ పార్టీ జరిగినట్టు వచ్చిన వార్తలు తెలంగాణలో కలకలం రేపాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 27, 2024, 12:24 PM IST
Rave Party: కేటీఆర్‌ బావమరిది ఫామ్‌హౌస్‌లో రేవ్‌ పార్టీ? భారీగా విదేశీ మద్యం, అమ్మాయిలు అరెస్ట్‌

KTR Brother In Law: హైదరాబాద్‌ మహానగరంలో వారాంతం కాగానే రేవ్‌ పార్టీలు కలకలం రేపుతున్నాయి. ప్రతి వీకెండ్‌కు ఎక్కడో ఓ చోట రేవ్‌ పార్టీ జరుగుతున్న ఘటనలు పోలీస్‌ శాఖను ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. అనుమతి లేనిది విదేశీ మద్యంతోపాటు యువతులతో అశ్లీల నృత్యాలు, డ్రగ్స్‌ వినియోగం చేస్తూ పట్టుబడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్‌ బావమరిది ఫామ్‌హౌస్‌లో రేవ్‌ పార్టీ జరిగినట్లు తెలుస్తోంది. అక్కడ భారీగా విదేశీ మద్యం లభించడంతో పాటు యువతులు ఉండడం కలకలం రేపింది.

Also Read: Metro Rail: హైదరాబాద్‌ ప్రజలకు భారీ శుభవార్త.. పరుగులు పెట్టనున్న మెట్రో రైలు రెండో దశ

హైదరాబాద్‌ శివారులోని జన్వాడ గ్రామ పరిధిలో కేటీఆర్‌ బావ మరిది రాజ్‌ పాకాలకు ఓ ఫామ్‌ హౌస్‌ ఉంది. అక్కడ శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజామున ఓ పార్టీ జరిగింది. అక్కడ రేవ్‌ పార్టీ జరుగుతున్న సమాచారం తెలుసుకున్న సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు దాడులు చేశారు. పెద్ద ఎత్తున డీజే శబ్దాలు రావడంతో దాడులు చేసినట్లు సమాచారం. ఈ పార్టీలో 21 మంది పురుషులు, 14 యువతులు పాల్గొన్నారు.

Also Read: Telangana Employees: ఒక డీఏ ఇచ్చారు థ్యాంక్స్‌.. మిగతా డీఏలు త్వరగా ఇవ్వాలి

 

ఈ క్రమంలోనే డ్రగ్స్ వినియోగించినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా కొందరికి పరీక్షలు చేయగా ఒక వ్యక్తికి కొకైన్ పాజిటివ్ తేలింది. డ్రగ్ నిర్ధారణ కావడంతో ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో భారీగా విదేశీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన విదేశీ మద్యం బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.

ఎంపీ అనిల్‌ ఆగ్రహం
ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ చేసుకోవడంపై కాంగ్రెస్‌ ఎంపీ ఎంపీ అనిల్ యాదవ్ స్పందించారు. 'డ్రగ్స్ లేకుండా తెలంగాణగా చేయాలని ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంటే కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల సొంత ఫామ్ హౌస్‌లో డ్రగ్, విదేశీ మద్యంతో పార్టీ ఇచ్చారు. ఇది రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాను ప్రోత్సహించేలా ఉంది' అని తెలిపారు. 'డ్రగ్స్ పార్టీలో ఎంత పెద్ద వారు ఉన్నా వదిలిపెట్టం. కఠినంగా శిక్షించాల్సిందే' అని స్పష్టం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook

Trending News