Ka Paul Comments: మత విధ్వేషాలు దేని కోసం..బండి సంజయ్‌పై కేఏ పాల్ ఫైర్..!

Ka Paul Comments: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ టార్గెట్‌గా ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ మరోసారి విమర్శలు గుప్పించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 27, 2022, 08:59 PM IST
  • రాజకీయాల్లో జోరు పెంచిన కేఏ పాల్
  • తెలుగు రాష్ట్రాలపై ఫోకస్
  • బండి సంజయ్‌ టార్గెట్‌గా విమర్శలు
Ka Paul Comments: మత విధ్వేషాలు దేని కోసం..బండి సంజయ్‌పై కేఏ పాల్ ఫైర్..!

Ka Paul Comments: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ టార్గెట్‌గా ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. వెంటనే దీనిపై బీజేపీ అధిష్టానం స్పందించాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలన్నారు.

ఒంగోలులో టీడీపీ మహానాడు దేని కోసమని ప్రశ్నించారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే..ఎన్టీఆర్ కుటుంబానికి పార్టీ పగ్గాలు ఇవ్వాలన్నారు. బాలకృష్ణకు గానీ.. జూనియర్ ఎన్టీఆర్‌కు గాని ఆ బాధ్యతలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీల అందరికీ ఆర్.కృష్ణయ్య ప్రతినిధినా అని కేఏ పాల్‌ మండిపడ్డారు. ఏ ప్రతిపాదికన ఆర్‌.కృష్ణయ్యకు సీఎం జగన్‌ రాజ్యసభ సీటు ఇచ్చారని ప్రశ్నించారు. రాజ్యసభ సీటు ఇచ్చినంత మాత్రాన బీసీలంతా ఓట్లు వేయరని చెప్పారు. 

ఓట్ల కోసం కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదన్నారు. గతకొంతకాలంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కేఏ పాల్ చురుగ్గా పాల్గొంటున్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇటీవల తెలంగాణలో ఆయనపై టీఆర్ఎస్‌ నేత దాడి చేశారు. దీనిపై అప్పట్లో రాజకీయ దుమారం రేగింది. రాబోయే ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో సుమారు సీట్లు సాధిస్తామని కేఏ పాల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also read:Ladakh Accident: లడఖ్ లో ఘోర ప్రమాదం.. నదిలో పడిన ఆర్మీ బస్సు.. 7 మంది జవాన్లు మృతి!

Also read:KTR Davos Tour: విజయవంతంగా ముగిసిన మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News