Revanth Reddy: రేవంత్ రెడ్డి... ఉమ్మడి ఆంధప్రదేశ్ లోనే ఆయనకు ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరు. రాష్ట్ర విభజన తర్వాత మరింతగా రాటు దేలారు. దూకుడు రాజకీయం. పవర్ పంచ్ లతో చేసే ప్రసంగాలే ఆయనకు బలం. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించారు. తెలంగాణ వచ్చాకా కొంత కాలం టీటీడీపీ చీఫ్ గా పని చేసిన రేవంత్ రెడ్డి.. 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. గత ఏడాది రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. పీసీసీ చీఫ్ గా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు రేవంత్ రెడ్డి. కేంద్రంలో ఉన్న బీజేపీని.. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆయన పోరాడుతున్నారు. మొదటి నుంచి సీఎం కేసీఆర్ టార్గెట్ గానే రాజకీయాలు చేసిన రేవంత్ రెడ్డి.. ఇటీవల కాలంలో మరింత స్పీడ్ పెంచారు. కేసీఆర్ ఫ్యామిలీపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు.
తమపై ఆరోపణలు చేసే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసేందుకు చంద్రబాబును అస్త్రంగా చేసుకుంటుంటాయి టీఆర్ఎస్, బీజేపీ. రేవంత్ రెడ్డిని చంద్రబాబు మనిషిగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తుంటారు ఆ పార్టీ నేతలు. చంద్రబాబు డైరెక్షన్ లోనే రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని.. రేవంత్ రెడ్డికి ఫండింగ్ కూడా టీడీపీ నుంచే వస్తుందనే ఆరోపణలు చేస్తుంటారు. తెలంగాణ బద్ద వ్యతిరేకి.. రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి చివరి వరకు ప్రయత్నించిన చంద్రబాబు తొత్తుకు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించిందని పలుసార్లు టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆరోపించారు. కొందరు కాంగ్రెస్ నేతలు కూడా రేవంత్ రెడ్డిపై ఇవే ఆరోపణలు చేయడం ఆ పార్టీలో కలకలం రేపింది. చంద్రబాబు చెప్పడం వల్లే రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి వచ్చిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్ చేశారు. టీఆర్ఎస్ నేతలు కూడా ఇవే ఆరోపణలు చేశారు.
అయితే తనను చంద్రబాబు మనిషిగా ప్రచారం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని టీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని పలు సార్లు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాజాగా చంద్రబాబు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సంస్థాన్ నారాయణపురంలో పర్యటించారు రేవంత్ రెడ్డి. సర్వేలు సభలో టీఆర్ఎస్, బీజేపీపై నిప్పులు చెరిగారు. ఆ సందర్భంగానే తనను చంద్రబాబు మనిషి అంటూ చేస్తున్న ఆరోపణలపై మాట్లాడారు. తనను చంద్రబాబే కాంగ్రెస్ లోకి పంపించారంటూ సంచలన ప్రకటన చేశారు. ఆయన పంపిస్తే తప్పేంటని ప్రశ్నించారు. చంద్రబాబు కూడా కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ప్రారంభించారని చెప్పారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు.. ఐదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారని తెలిపారు. కాంగ్రెస్ లో మంత్రిగా పని చేసిన చంద్రబాబు తర్వాత టీడీపీలోకి వెళ్లారని చెప్పారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వెళ్లారు కాబట్టి.. తనను చంద్రబాబు.. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి పంపించారేమో అంటూ కామెంట్ చేశారు.
తనను చంద్రబాబే కాంగ్రెస్ లోకి పంపించారంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి. చంద్రబాబును బూచీగా చూపుతూ తనను పదేపదే టార్గెట్ చేస్తున్న ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెట్టేందుకే రేవంత్ రెడ్డి ఈ విషయంలో స్పష్టత ఇచ్చారని అంటున్నారు. రేవంత్ రెడ్డే క్లారిటీ ఇచ్చినందున.. ఈ విషయంలో ఇకపై టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆరోపణలు చేసినా జనాలు పెద్దగా పట్టించుకోరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.
Also Read: Ind vs Aus 2nd T20 Match: ఆసిస్‌పై టీమిండియా విజయం.. ఉప్పల్ మ్యాచ్‌పై పెరిగిన ఉత్కంఠ
Also Read: Pooja Hegde Hot Photos: ఎద అందాలు ఆరబోస్తున్న బుట్టబొమ్మ.. క్లీవీజ్ కనిపించేలా ట్రీట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి