Osmania University: ఉస్మానియా యూనివర్శిటీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. యూనివర్శిటీలోకి వచ్చే గేట్లను పోలీసులు మూసివేశారు. ఓయూ లేడీస్ హాస్టల్స్ మెరుపు ధర్నాకు దిగడమే క్యాంపస్ లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. సెమిస్టర్ పరీక్షలు పూర్తి కావడంతో యూనివర్శిటీకి దసరా సెలవులు ప్రకటించారు. హాస్టల్స్ ఖాళీ చేయాలని విద్యార్థినులకు ఓయూ చీఫ్ వార్డెన్ ఆదేశించారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్ ఎదురుగా ఉన్న రోడ్డుపై బైఠాయించారు. హాస్టల్స్ మూసివేయవద్దని నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. హాస్టల్స్ మూసివేస్తే తాము ఎక్కడ ఉండాలని ప్రశ్నిస్తున్నారు విద్యార్థినిలు. యూనివర్శిటీ విసీ వచ్చి తమ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణలో ప్రస్తుతం ఉద్యోగ మేళా జరుగుతోంది. ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు ఇస్తోంది. ఇప్పటికే గ్రూప్ వన్ దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తైంది. చాలా కాలం తర్వాత గ్రూప్ వన్ పోస్టులు పడటంతో విద్యార్థినులు సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు. గ్రూప్ వన్ తో ఇతర శాఖలకు సంబంధించి పలు నోటిఫికేషన్లు వచ్చాయి. ఉద్యోగాలకు సిద్ధమవుతున్న సమయంలో హాస్టల్స్ మూసివేయడం ఏంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. హాస్టల్స్ మూసివేస్తే తాము ఎక్కడికి పోవాలని, ఎక్కడ ప్రిపేర్ కావాలని నిలదీస్తున్నారు. దసరా సెలవులు వచ్చినంత మాత్రానా హాస్టల్స్ మూసివేయాల్సిన అవసరం లేదని.. తమకు ఇప్పుడు పండగల కంటే ఉద్యోగ సాధనే ముఖ్యమంటున్నారు విద్యార్థులు.
ఓ వైపు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సమైక్యత, విమోచన సంబరాలు జరుగుతుండగా.. ఓయూలో విద్యార్థులు ఆందోళనకు దిగడం కలకలం రేపుతోంది. విద్యార్థినిల ఆందోళన నేపథ్యంలో అప్రమత్తమయ్యారు పోలీసులు. ఓయూలోకి ఇతరలు ఎవరూ రాకుంజా గేట్లు మూసివేశారు.
Read Also: Revanth Reddy: హైదరాబాద్ లో అల్లర్లు లేపి.. పరిశ్రమలను గుజరాత్ కు తరలించే కుట్ర!
Read Also: AP Capital: రాజధాని నిర్ణయించే హక్కు రాష్ట్రానిదే! సుప్రీంకోర్టులో జగన్ సర్కార్ పిటిషన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి