Surekha Fever: తెలంగాణ అటవీ, దేవాదాయ ధర్మాదాయ, పర్యావరణ శాఖ మంత్రి అయిన కొండా సురేఖ అనారోగ్యానికి గురయ్యారు. కొన్ని రోజుల నుంచి ఆమె ఆరోగ్యం బాగా లేదని సమాచారం. ఐదు రోజులుగా ఆమె జ్వరంతో బాధపడుతున్నారని తెలిసింది. జ్వరం తగ్గకపోవడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా డెంగీ పాజిటివ్‌గా పరీక్ష ఫలితాల్లో తేలింది. దీంతో ఆమె హైదరాబాద్‌కు పరిమితమయ్యారు. హైదరాబాద్‌లోని నివాసంలో విశ్రాంతి పొందుతున్నారు.
Also Read: Pushya Masam: తెలంగాణలో కొత్త పండుగ.. వదిన మరదళ్లు ఇవి ఇచ్చిపుచ్చుకోవాలంట..
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో ఆమె అస్వస్థతకు గురయ్యారంట. ప్రస్తుతం తీవ్ర అలసటతోపాటు ఒళ్లునొప్పులతో బాధపడుతున్నారని ఆమె అనుచరులు చెప్పారు. ఈ కారణంగా సురేఖ తన మంత్రిత్వ శాఖపై సమీక్షలు చేయడం ఇబ్బందిగా మారింది. దీనికితోడు ఆసియాలోనే అతిపెద్ద జాతర అయిన మేడారంపై సమీక్ష చేయలేకపోతున్నారు. జ్వరం బారినపడడంతో ఆమె సచివాలయానికి, మంత్రిత్వ శాఖ కార్యాలయాలకు వెళ్లలేకపోతున్నారు.
Also Read: Oye Re Release: 'ఓయ్' రీ రిలీజ్ క్రేజ్.. థియేటర్‌లో యువతి డ్యాన్స్ అదుర్స్ వావ్ వావ్
తన నివాసానికే ఆయా శాఖ అధికారులను పిలిపించుకుని పర్యవేక్షణ చేస్తున్నారు. మేడారం జాతరకు సంబంధించిన అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖలన్నీ సురేఖ పరిధిలోనే ఉన్నాయి. అటవీ ప్రాంతంలో ఉన్న మేడారం దేవాదాయ ధర్మదాయ శాఖ పరిధిలోకే వస్తుంది. కీలకమైన ఈ జాతర సమయంలోనే మంత్రి అనారోగ్యం బారినపడడంతో జాతర పనులు మందకొడిగా సాగుతున్నాయని సమాచారం.
ఇప్పటికే మేడారం జాతరకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. 21 నుంచి 24వ తేదీ వరకు మంత్రి కోలుకుంటారో లేదో అనేది తెలియడం లేదు. మేడారంలో దగ్గరుండి పనులు పర్యవేక్షించాల్సి ఉండగా సురేఖ బదులు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అయిన సీతక్క మొత్తం బాధ్యతలు చూసుకుంటున్నారు. రోజు జాతర ప్రాంతంలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దాదాపు రెండు కోట్ల మంది జాతరకు హాజరవుతారని తెలుస్తోంది. దానికి తగ్గట్లు ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. మేడారం జాతరలో రాష్ట్ర ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదని ఆరోపణలు వస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook