Balapur Ganesh laddu auction: తొలిసారి బాలాపూర్ లడ్డూ వేలంపాట రద్దు

లడ్డూ ధరలకు ప్రసిద్ధి గాంచిన బాలాపూర్‌లో గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది. బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది లడ్డూ వేలంపాటను రద్దు (Balapur Ganesh laddu auction 2020) చేసినట్టు తెలిపింది.

Last Updated : Sep 1, 2020, 11:33 AM IST
Balapur Ganesh laddu auction: తొలిసారి బాలాపూర్ లడ్డూ వేలంపాట రద్దు

నేడు హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం (Hyderabad Ganesh Immersion) జరుగుతోంది. లడ్డూ ధరలకు ప్రసిద్ధి గాంచిన బాలాపూర్‌లో వేలం పాట లేకుండానే గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది. ప్రత్యేక పూజల తరువాత మండపం నుంచి బాలాపూర్ గణపయ్య (Balapur Ganesh) బయలుదేరాడు. బాలాపూర్ గ్రామంలో శోభాయాత్ర కొనసాగుతోంది. నిమజ్జనం అనగానే మనకు మొదట గుర్తొచ్చేది వేలం పాట. అందులో వేలం పాట పేరు చెబితే అందరి నోటా వచ్చేది బాలాపూర్ లడ్డూ ధర (Balapur Ganesh 2020 laddu auction). JEE Main Guidelines: జేఈఈ మెయిన్ హాల్ టికెట్ అక్కడే పారేయాలి

కరోనా వ్యాప్తి నేపథ్యంలో బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది లడ్డూ వేలంపాటను రద్దు (Balapur Ganesh laddu auction 2020) చేసినట్టు తెలిపింది. 1994లో బాలాపూర్ గణేష్ వేలంపాట మొదలుకాగా.. ఓ ఏడాది కార్యక్రమం నిలిపివేయడం ఇదే తొలిసారి. కరోనా వ్యాప్తి కారణంగా బాలాపూర్ లడ్డూ వేలంపాటను రద్దు చేసినట్లు ఉత్సవ కమిటీ చెబుతోంది. Bank Holidays: సెప్టెంబర్‌లో బ్యాంకు సెలవులు ఇవే..

1994లో తొలి ఏడాది రూ.450కి కొలను మోహన్ రెడ్డి బాలాపూర్ గణపయ్య లడ్డూను సొంతం చేసుకోగా.. గతేడాది (2019లో) కొలను రాంరెడ్డి అనే భక్తుడు రూ.17.60 లక్షల రికార్డు ధరకు బాలాపూర్ లడ్డూను వేలంలో సొంతం చేసుకోవడం తెలిసిందే.  Khatron Ke Khiladi టైటిల్ విన్నర్, నటి నియా శర్మ ఫొటో గ్యాలరీ
Anu Emmanuel Hot Photos: కొంచెం క్యూట్‌గా.. కొంచెం హాట్‌గా నటి

Trending News