KTR Gifts: విద్యార్థులకు కేటీఆర్‌ 'అమూల్యమైన కానుక'.. చిన్నదే అయినా ఎంతో ప్రత్యేకం

KT Rama Rao Gifts To Students: ప్రజలతో ప్రత్యేక అనుబంధం కొనసాగిస్తుంటే ఆ ప్రజాప్రతినిధికి ఓటమి అనేదే ఉండదు. అలా సిరిసిల్ల ప్రజలతో ప్రత్యేక అనుబంధం కొనసాగిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్‌ తాజాగా నియోజకవర్గ ప్రజలతో మరింత ఆత్మీయత పంచుకున్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 26, 2024, 04:29 PM IST
KTR Gifts: విద్యార్థులకు కేటీఆర్‌ 'అమూల్యమైన కానుక'.. చిన్నదే అయినా ఎంతో ప్రత్యేకం

KTR Gifts: ప్రజలతో మమేకం అవడంలో బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ శైలే వేరు. నియోజకవర్గ ప్రజలను కేటీఆర్‌ కుటుంబసభ్యుల్లా భావిస్తారు. మంత్రిగా కన్నా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండడంతో మరింత ప్రజల మధ్య ఉంటున్నారు. తాజాగా నియోజకవర్గంలోని విద్యార్థులకు కేటీఆర్‌ 'అమూల్యమైన కానుక' పంపి ప్రజలతో ఉన్న ఆత్మీయత పంచుకున్నారు. చిన్న విషయమే అయినా ఎంతో ప్రత్యేకంగా కేటీఆర్ పేర్కొన్నారు.

Also Read: No Electricity Bill: తెలంగాణ ప్రజలకు శుభవార్త.. మార్చి నెల కరెంట్‌ బిల్లు కట్టనవసరం లేదు

ప్రస్తుతం విద్యార్థులకు పరీక్ష సమయం. తన నియోజకవర్గంలో పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్‌ ఆత్మీయత పంచుకున్నారు. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఓ చిరు కానుక అందజేశారు. పదో తరగతి పరీక్షలు రాస్తున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కేటీఆర్‌ 'గిఫ్ట్‌ ఏ స్మైల్‌' కింద కొన్ని వస్తువులను పంపారు.

Also Read: Delhi Liquor Scam: 'నాకు చాలా అనుమానాలున్నాయి.. విచారణకు రాలేను': సీబీఐకి కవిత లేఖ

పరీక్ష రాస్తున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పెన్నులు, పరీక్ష ప్యాడ్‌ కేటీఆర్‌ అందించారు. నియోజకవర్గంలో ఉన్న విద్యార్థులకు ౩ వేల గిఫ్ట్‌ ప్యాక్‌ను పంపిణీ చేశారు. ఈ విషయాన్ని కేటీఆర్‌ 'ఎక్స్‌' వేదికగా స్పందించారు. 'చిన్న విషయమే. కానీ నాకు ప్రత్యేకం. నా నియోజకవర్గంలో పదో తరగతి బోర్డు పరీక్షలు రాస్తున్న 3 వేల మంది విద్యార్థులకు వాటిని అందించాం. వారందరికీ ఆల్ద బెస్ట్‌' అని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా పెన్నులు, పరీక్ష ప్యాడ్‌లను పంపించిన నాలుగు ఫొటోలను పంచుకున్నారు.

సిరిసిల్లి నియోజకవర్గ ప్రజలకు కేటీఆర్‌ ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పాటుచేసుకుంటున్నారు. నియోజకవర్గంలోని ప్రజల కష్టసుఖాల్లో భాగమవుతున్నారు. పెళ్లిళ్లు, పేరంటాలతోపాటు విషాద సమయంలోనూ ప్రజలకు తోడుగా నిలుస్తున్నారు. ఇలాంటి అనుబంధాన్ని మాజీ మంత్రి హరీశ్‌ రావు సిద్దిపేట నియోజకవర్గంలో కొనసాగిస్తున్నారు. ఇటీవల పదో తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు హరీశ్‌ రావు లేఖలు రాసిన విషయం తెలిసిందే.

హరీశ్ రావు మాదిరే కేటీఆర్‌ నియోజకవర్గ ప్రజలతో ప్రత్యేక అనుబంధం కొనసాగిస్తున్నాడు. ఇక పరీక్ష ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులకు కేటీఆర్‌ ప్రత్యేకంగా సన్మానించే అవకాశం ఉంది. పేద విద్యార్థులకు మరింత ప్రోత్సాహం అందిస్తున్నారు. హరీశ్‌ రావు, కేటీఆర్‌ ప్రోత్సాహంతో పరీక్ష ఫలితాల్లో సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గ విద్యార్థులు సత్తా చాటుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News