డెంగ్యూ దెబ్బకు ఒకే కుటుంబంలో నలుగురు మృతి

డెంగ్యూతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి

Last Updated : Oct 30, 2019, 08:35 PM IST
డెంగ్యూ దెబ్బకు ఒకే కుటుంబంలో నలుగురు మృతి

మంచిర్యాల: డెంగ్యూ వ్యాధి ఓ కుటుంబాన్ని దారుణంగా దెబ్బతీసింది. 15 రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబంలో డెంగ్యూ నలుగురిని బలిగొంది. మంచిర్యాల శ్రీశ్రీనగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని డెంగ్యూ పొట్టనపెట్టుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. మంచిర్యాలకు చెందిన ఈద సోనా అనే వివాహిత సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సోనా భర్త, తాత, కుమార్తె కూడా ఇప్పటికే డెంగ్యూ వ్యాధితో మృతి చెందగా.. నిన్న మగ పిల్లాడికి జన్మనిచ్చిన అనంతరం ఆమె కూడా మృతి చెందిన తీరు పలువురిని కలచివేసింది. 15 రోజుల్లోనే ఒకే కుటుంబంలో నలుగురు డెంగ్యూ కారణంగా మృత్యువాతపడటంతో ఆ కుటుంబం, వారి బందువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పలు ప్రాంతాల్లో డెంగ్యూ వ్యాధి విజృంభిస్తోన్న తీరుకు ఈ ఘటన నిలువుటద్దంలా నిలిచింది.

Trending News