CP CV Anand: హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్..డయల్ 100కు కాల్ చేశారు. తన నివాస ప్రాంతంలో సౌండ్ పొల్యుషన్ ఆపాలని డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంటర్ 10లో ప్లజెంట్ వ్యాలీలో ఆయన నివాసముంటున్నారు. అర్ధరాత్రి సమయంలో ఆయన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా కొందరు వ్యక్తులు టపాసులు పేలుస్తూ న్యూసెన్స్ చేస్తున్నారు. దీంతో డప్పుల హోరుతో శబ్ధ కాలుష్యం చేస్తున్నారని డయల్ 100కు సీవీ ఆనంద్ కాల్ చేశారు. నైట్ డ్యూటీలో ఉన్న జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాస్, ఇతర సిబ్బంది హుటాహుటిన అక్కడికి వెళ్లారు.
స్థానిక బస్తీలో తొట్టెల ఊరేగింపు జరుగుతున్నట్లు గుర్తించారు. నిర్వాహకుడు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని 70బీ కింద కేసు నమోదు చేశారు. అర్ధరాత్రి సమయాల్లో శబ్ధ కాలుష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. ఇలాంటి వాటి పట్ల నగరవాసులు సీరియస్‌గా ఉండాలన్నారు. సీపీ నుంచి డయల్ 100కు కాల్ రావడంతో పోలీసులు సైతం షాక్ అయ్యారు. సామాన్యుడిలా ఆయన ఫిర్యాదు చేయడం అందర్నీ ఆశ్చర్యపర్చింది.
Also read:అప్పుడే ఓటీటీలోకి 'పక్కా కమర్షియల్'.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎందులోనో తెలుసా?
Also read:Income tax return:గడువులోగా ఐటీ రిటర్న్ ఫైల్ చేయకుంటే ఏం జరుగుతుంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook