తెలంగాణలో కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి కొనసాగుతోంది. సోమవారం రాత్రి 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 2,072 కరోనా పాజిటివ్ కేసులు (Telangana Corona Positive Cases) నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి తెలంగాణలో ఇప్పటివరకూ నమోదైన కోవిడ్19 పాజిటివ్ కేసుల సంఖ్య 1,89,283కి చేరింది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది కరోనాతో పోరాడుతూ చనిపోయారు. తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,116కు చేరుకుంది. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ఈ మేరకు మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
సోమవారం ఒక్కరోజు 54,308 కరోనా శాంపిల్స్‌కు నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఓవరాల్‌గా తెలంగాణలో ఇప్పటివరకూ 29,40,642 (29 లక్షల 40 వేలు) కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇటీవల తగ్గముఖం పట్టినట్లే కనిపించిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. చికిత్స అనంతరం తెలంగాణలో ఇప్పటివరకూ 1,58,690 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29,477 యాక్టివ్ కేసులుండగా.. అందులో 23,934 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారని సమాచారం.
ఆసక్తికర కథనాలు
COVID19: తెలంగాణలో కొత్తగా 2,072 కరోనా కేసులు