V hanumantha rao hot comments on margadarsi case issue: రామోజీ ఫిల్మ్ సిటీ అధినేత రామోజీ రావు ఈరోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. కొన్నిరోజులుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. నిన్న రాత్రి నుంచి ఆరోగ్యం దిగజారింది. దీంతో ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ మీద చికిత్స అందించారు. ఈక్రమంలో ఈరోజు (శనివారం) తెల్లవారుజామున 4.50 గం.కు రామోజీరావు శివైక్యం చెందారు. ఈ నెల 5న ఆయన అనారోగ్య సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. రామోజీ రావు అసలు పేరు.. చెరుకూరీ రామారావు. ఆయన.. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌తో వ్యాపార ప్రస్థానం ప్రారంభించారు. పచ్చళ్లు అమ్ముతు తన ప్రస్థానం ప్రారంభించిన రామోజీ రావు.. వటుడింతై అన్న విధంగా, ఉన్నత స్థానానికి ఎదిగారు.
Read more: Snakes venom: ఈ మొక్కలతో పాము విషం బలాదూర్.. ఇలా పెంచుకోవాలంటున్న నిపుణులు..
రామోజీ రావు అకాల మరణం పట్ల ఇటు.. సినీ, రాజకీయ, అన్ని వర్గాల ప్రజలు కూడా తమ సంతాపం తెలియజేశారు. ఇదిలా ఉండగా.. రామోజీ పిల్మ్ సిటీకి రామోజీ రావు భౌతిక కాయంను అభిమానులు, వీఐపీలు, రాజకీయా నాయకుల సందర్శన కోసం ఉంచారు. ఇప్పటికే తెలంగాణ, ఏపీ నుంచి రాజకీయ ప్రముఖులు రామోజీ రావుకు ఘనంగా నివాళులు అర్పించారు. సినిమా రంగం నుంచి అతీరథ మహరథులు కూడా రామోజీరావు చివరి చూపు కోసం ఫిల్మ్ సిటీకి వచ్చారు.
అక్షర యోధులు, అనేక రంగాలలో అద్భుతమైన విజయాలు అందుకుని, భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచిన విశిష్టమైన వ్యక్తి, శ్రీ రామోజీ రావు గారి మరణం అత్యంత విషాదకరమని, యావత్ దేశానికి కూడా ఇదోకతీరని లోటని పలువురు నాయకులు పేర్కొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రజనీకాంత్, చంద్రబాబు, రేవంత్ రెడ్డి, చిరంజీవి, అల్లుఅర్జున్ వంటి అనేక మందిరాజకీయ, సినిరంగ ప్రముఖులు రామోజీరావుతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అదే విధంగా రామోజీ మరణానికి సంతాపం తెలియజేస్తు, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదిలా ఉండగా... రామోజీరావుని చివరిచూపు చూడటానికి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వీ హనుమంత్ రావు కూడా వచ్చారు. ఈ నేపథ్యంలో రామోజీరావుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రామోజీరావును గతంలో సీఎంగా పనిచేసిన దివంగత నేత.. వైఎస్సార్ తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేశాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్శదర్శి స్కామ్ అంటూ 2600 కోట్లు అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు చేశారని హనుమంత్ రావు అన్నారు. దీంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారని హనుమంత్ రావు అన్నారు.
Read more: Ramoji rao: రామోజీరావు వల్లే అమరావతి రాజధాని.. ఆ సీక్రెట్ బయట పెట్టిన చంద్రబాబు..
తాను.. దీనిపై వైఎస్సార్ ను ప్రశ్నించినట్లు గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా రామోజీని విచారించడానికి రామోజీ పిల్మ్ సిటీలో సీఐడీ పోలీసులను పంపిన విషయం తెలిసిందే. ఆయన బెడ్ మీద ఉన్న ఫోటోలు గతంలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలో రామోజీని ఇబ్బందులుపెట్టడం వల్ల.. జగన్ కు ఇలాంటి గతి పట్టిందని కూడా కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter