KCR NEW PARTY: జాతీయ స్థాయిలో కొత్త పార్టీ దిశగా చకచకా అడుగులు వేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. గతంలో చెప్పినట్లే విజయదశమి రోజున కొత్త పార్టీ పేరు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న కేసీఆర్ తనకు కలిసివచ్చే సెంటిమెంట్లను పాటించబోతున్నారు. సిద్దిపేట జిల్లాలోని కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కేసీఆర్ కు సెంటిమెంట్. ప్రతి ఎన్నికల్లోనూ నామినేషన్ వేసే ముందు ఆ గుడిలోనే ఆయన పూజలు చేస్తారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావానికి ముందు కూడా కోనాయిపల్లి ఆలయంలో పూజలు చేసి వెళ్లారు కేసీఆర్.
తన సెంటిమెంట్ ను పాటిస్తూ గురువారం కోనాయిపల్లికి వెళ్లనున్నారు కేసీఆర్. పార్టీ ముఖ్య నేతలతో కలిసి జాతీయ పార్టీ ప్రకటనకు ముందు ప్రత్యేక పూజలు చేయనున్నారు. తర్వాత యాదాద్రికి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారని తెలుస్తోంది. లక్ష్మి నర్సింహ్మ స్వామిని దర్చించుకోకునున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు కేసిఆర్. జాతీయ రాజకీయాల్లో సక్సెస్ కావాలని గులాబీ బాస్ పూజలు చేయనున్నారు. జాతీయ పార్టీ ప్రకటనకు దసరా రోజున కేసీఆర్ ముహుర్తం ఫిక్స్ చేశారని తెలుస్తోంది. అక్టోబర్ ఐదున పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్. టీఆర్ఎల్పీతో పాటు కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో జాతీయ పార్టీ ఏర్పాటుపై తీర్మానం చేయనున్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో జాతీయ పార్టీ ఏర్పాటు విషయమై కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
జాతీయ పార్టీకి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో కేసీఆర్ కసరత్తు చేశారని తెలుస్తోంది. పార్టీ పేరును దాదాపుగా నిర్ణయించారని చెబుతున్నారు. నాలుగు పేర్లను పరిశీలించిన కేసీఆర్.. మొదటి నుంచి ప్రచారం జరుగుతున్న భారతీయ రాష్ట్ర సమితి వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. దసరా రోజున ఆ పేరునే ప్రకటించనున్నారని చెబుతున్నారు. పార్టీకి దేశ వ్యాప్తంగా కో ఆర్డీనేటర్లను కేసీఆర్ ఖరారు చేశారని.. వారి పేర్లను దసరా రోజున ప్రకటించనున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దసరా రోజున నిర్వహిస్తున్న సమావేశానికి పలువురు జాతీయ నేతలను కేసీఆర్ ఆహ్వానించారని తెలుస్తోంది. కేసీఆర్ పార్టీకి మద్దతుగా ఉండేవాళ్లపై చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. సిని హీరో ప్రకాశ్ రాజ్ చాలా కాలంగా కేసీఆర్ కు సన్నిహితంగా ఉంటున్నారు. జాతీయ రాజకీయాలపై చర్చించేందుకు పలు రాష్ట్రాలకు వెళ్లిన కేసీఆర్.. తనతో పాటు ప్రకాశ్ రాజ్ ను తీసుకువెళ్లారు. దీంతో తాను పెట్టబోయే జాతీయ పార్టీలో ప్రకాష్ రాజ్ కు కీలక బాధ్యతలు ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాలంలో రైతు సమస్యలపై ఎక్కువగా ఫోకస్ చేశారు కేసీఆర్. తన పార్టీలోనే రైతు సంఘాల నేతలకు పెద్దపీట వేస్తారని భావిస్తున్నారు.
Read also: PM Kisan Latest Update: పీఎం కిసాన్ పథకంలో కీలక మార్పులు..రైతుల కోసం పలు సూచనలు..!
Read also: TRS VS BJP: కేంద్రానికి కేటీఆర్ థాంక్స్.. హరీష్ రావు సెటైర్స్ .. అసలు ఏంటీ మేటర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి