Ktr expressed regret for his comments on womens: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారాయి. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. దీనిలో భాగంగా ఇటీవల బస్సులలో కొంత మంది మహిళల ఎల్లిపాయలు తరుగుతూ, కుట్లు అల్లికలు చేస్తున్న వీడియోలు వైరల్ గా మారాయి. ఒకవైపు .. రేవంత్ సర్కారు ప్రవేశ పెట్టిన మహాలక్ష్మీ పథకంపై ప్రజలు ఆదరిస్తుంటే.. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కావాలని లేనిపోని విధంగా విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు.
నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను ..
నా అక్కచెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు.
— KTR (@KTRBRS) August 16, 2024
అంతేకాకుండా..కాంగ్రెస్ మంత్రి సీతక్క సైతం.. ఇటీవల మాట్లాడుతూ.. బస్సుల్లో కొంత మంది మహిళలు లాంగ్ జర్నీలు చేస్తుంటారని.. అలాంటి సమయంలో ఏదో పనులు చేస్తుంటే..దాన్ని కూడా రాజకీయాలు చేయాలా.. అంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఇటీవల మహిళల బస్సు ప్రయాణాలపై సెటైర్ లు వేస్తు.. బస్సుల్లో కుట్లు అల్లికలు కాదు.. బ్రేక్ డ్యాన్స్ లు చేసిన పర్వాలేదని, కానీ.. బస్సుల సంఖ్యను మాత్రం పెంచాలంటూ కామెంట్లు చేశారు.
దీంతో ఇది కాస్త వివాదానికి కారణంగా మారింది. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు సీరియస్ అయ్యారు. తాము.. ప్రవేశ పెట్టిన పథకంకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీఆర్ఎస్ వాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇది వివాదాస్పదంగా మారడంతో మహిళ కమిషన్ కూడా దీనిపై సీరియస్ అయ్యింది. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మహిళలను అగౌరవపర్చేలా ఉన్నాయంటూ కూడా మహిళ కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదా ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
ఈ నేపథ్యంలో కేటీఆర్ తాజాగా తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. మహిళలను కించపర్చడం తన ఉద్దేష్యం కాదని ఎక్స్ వేదికగా మరోసారి ట్విట్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు మాత్రం దీనిపై భగ్గుమంటున్నాయి. మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై నిరసనలు తెలియజేస్తున్నారు. కేటీఆర్ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారని కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఈ వ్యాఖ్యలపై గరం గరం అవుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ఘటన తెలంగాణలో రాజకీయాల్లో హీట్ ను తెప్పించేదిగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి