Minister KTR: కేటీఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ

తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు ( KTR ) జన్మదినం సందర్భంగా ఆయనకు ప్రముఖులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  

Last Updated : Jul 24, 2020, 11:45 AM IST
Minister KTR: కేటీఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ

Birthday Wishes to KTR: హైదరాబాద్‌ :  తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు ( KTR ) జన్మదినం సందర్భంగా ఆయనకు ప్రముఖులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేకాకుండా టీఆర్ఎస్ శ్రేణులు, కేటీఆర్ అభిమానులు సైతం సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున విషెస్ చెబుతున్నారు. మంత్రి కేటీఆర్ ఈ రోజుతో 44వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ( T. Harish Rao ) ట్విట్టర్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్‌ ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నట్టు హరీష్‌ రావు ట్వీట్‌ చేశారు. హరీశ్ రావు ట్విట్‌కు కేటీఆర్ స్పందిస్తూ.. ధన్యవాదాలు బావ.. ఆయన అంటూ రీట్విట్ చేశారు. Also read: Andhra Pradesh: భారీగా తెలంగాణ మద్యం స్వాధీనం

అదేవిధంగా టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యడు జోగినపల్లి సంతోష్‌ కుమార్ (Joginapally Santosh Kumar) కూడా ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్‌డే అన్నయ్య.. మరెన్నో ఏండ్లు ఇలానే ప్రజాసేవలో కొనసాగుతూ... మరిన్ని పెద్ద పదవులను చేపట్టాలి. మమ్మల్ని ఇలా ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉండాలంటూ ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన కేటీఆర్‌తో చిన్నప్పుడు దిగిన ఫొటోను షేర్ చేశారు. Also read: Rain alert: నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ఇదిలాఉంటే.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ (V. Srinivas Goud), మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు సైతం సోషల్ మీడియా ద్వారా కేటీఆర్‌కు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆయనతో దిగిన ఫొటలను షేర్ చేస్తున్నారు.  Also read: IPL 2020: ఐపీఎల్ ప్రారంభం ఎప్పుడో తెలుసా?

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x