Mallu Ravi Resignation: గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగా పార్టీలో అనేక గ్రూపులు, అసంతృప్తులు ఎన్ని ఉన్నా కూడా కాంగ్రెస్‌కు ఎట్టకేలకు అధికారం దక్కింది. ప్రస్తుతం పార్టీలో విబేధాలు సద్దుమణిగాయనే అందరూ భావిస్తుండగా పార్టీ సీనియర్ నాయకుడు మల్లు రవి రాజీనామా చేయడంతో మరోసారి కల్లోలం రేపింది. అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి ఇచ్చిన ఢిల్లీలో 'రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి' పదవిని ఆయన తిరస్కరించారు. ఆ పదవి నాకొద్దంటూ రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో మళ్లీ కలకలం మొదలైంది. అయితే ఆయన పార్లమెంట్ టికెట్ ఆశించి రాజీనామా చేశారు.
Also Read: Kavitha: నిందితురాలిగా చేర్చిన సీబీఐ.. లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్ట్ తప్పదా?
రాజీనామా చేసిన అనంతరం మల్లు రవి శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ టికెట్ హామీతోనే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయలేదని చెప్పారు. ఈసారి టికెట్ ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు. 'రేవంత్ రెడ్డికి రాజీనామా పత్రం గతంలోనే పంపించా. ఆమోదిస్తారా లేదా? అనేది ఆయన నిర్ణయానికి వదిలేస్తా. నాగర్‌కర్నూల్ ఎంపీ టికెట్ ఇవ్వడానికి ఆ పదవి అడ్డంకిగా ఉంటుందనే అభిప్రాయంతోనే రాజీనామా చేశా' అని ప్రకటించారు.
Also Read: Rs 500 Gas: మేడారంలో రేవంత్ రెడ్డి శుభవార్త.. రూ.500కే గ్యాస్, రుణమాఫీ ఎప్పటినుంచంటే?
నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ఎంపీ టికెట్ కోసమే అసెంబ్లీ ఎన్నికల్లో జడచర్ల టికెట్ వదులుకున్నట్లు మల్లు రవి తెలిపారు. ఏ సర్వేలు చేసినా నాగర్‌కర్నూల్ ఎంపీగా తానే గెలుస్తానని చెబుతున్నాయని వివరించారు. 'ఆ టికెట్ నాకు ఇవ్వలేని పక్షంలో టికెట్ ఎందుకు నిరాకరిస్తున్నారో ప్రజలకు చెప్పాలి' అని డిమాండ్ చేశారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం జోడు పదవులు ఉండవద్దనే ఉద్దేశంతో ఆ పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. నాగర్‌కర్నూల్ తన అభ్యర్థిత్వానికి మంత్రి జూపల్లి కృష్ణారావు మద్దతు తెలుపుతున్నారని చెప్పారు.
అకస్మాత్తుగా మల్లు రవి రాజీనామా చేయడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ హవా తెలంగాణలో కొనసాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే హవా కొనసాగుతుందనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ స్థానాల్లో పోటీకి భారీ డిమాండ్ ఏర్పడింది. నాగర్‌కర్నూల్ స్థానానికి కూడా తీవ్ర డిమాండ్ ఉంది. ఇక్కడ ఆశావహులు భారీగా ఉన్నారు. ఈ క్రమంలో ఎంపీ టికెట్ దక్కదనే ఉద్దేశంతో మల్లు రవి తాజాగా రాజీనామా చేశారు. తనకు టికెట్ ఇవ్వరేమో అనే అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తనకు కాకుండా వేరొకరికి టికెట్ ఇవ్వడానికి మల్లు రవి ఇష్టపడడం లేదు. టికెట్ రేసులో తాను ఉన్నానని చెప్పేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Mallu Ravi: తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం.. సంచలనం సృష్టించిన మల్లు రవి రాజీనామా