హైదరాబాద్ లో 'వరల్డ్ స్వీట్ ఫెస్టివల్'

ఆహార ప్రియులందరికీ శుభవార్త. మీరు హైదరాబాద్‌లో ఉన్నారా? మీకు స్వీట్ అంటే ఇష్టమా? అయితే కొద్ది రోజులు ఓపిక పట్టండి. 

Last Updated : Jan 8, 2018, 01:01 PM IST
 హైదరాబాద్ లో 'వరల్డ్ స్వీట్ ఫెస్టివల్'

ఆహార ప్రియులందరికీ శుభవార్త. మీరు హైదరాబాద్‌లో ఉన్నారా? మీకు స్వీట్స్ అంటే ఇష్టమా? అయితే కొద్దిరోజులు ఓపిక పట్టండి. దేశీయ, అంతర్జాతీయ మిఠాయిల రుచులు మిమ్మల్ని కనువిందు చేయనున్నాయి. ఇప్పటి వరకు మీరు తినని స్వీట్స్ కూడా రుచి చూసే అరుదైన అవకాశం మీరు పొందబోతున్నారు. జనవరి13 నుంచి జనవరి 15 వరకు హైదరాబాద్లో జరగనున్న 'వరల్డ్ స్వీట్ ఫెస్టివల్' లో భారతదేశంతో పాటు, ఇతర దేశాల నుంచి కూడా ఎగుమతై వచ్చిన సుమారు 1000 రకాల పసందైన మిఠాయి స్టాళ్లను ప్రదర్శనకు ఉంచబోతుంది తెలంగాణ ప్రభుత్వం. పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఈ ఈవెంట్ జరగబోతోంది.

'అంతర్జాతీయ గాలిపటాల పండుగ'కు అనుబంధంగా ఈ ఫెస్టివల్ నిర్వహణ జరగనుంది. వివిధ రాష్ట్రాలు, దేశాల సంస్కృతి, ఆహారపు అలవాట్లను ప్రతిబింబించేలా 'స్వీట్ ఫెస్టివల్' నిర్వహణ జరగనుందని తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.

"ఈ ఈవెంట్‌లో స్టాళ్లను రాష్ట్రాల ప్రకారం వర్గీకరించడం జరుగుతుంది. ఉదాహరణకు 'పాయసం' గురించి తెలుసుకోవాలంటే అది కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఒడిశా, అస్సాంలో కూడా తయారుచేస్తారు. కాబట్టి దానికంటూ ఒక కౌంటర్‌‌ను ఏర్పాటు చేస్తాం. ఇలాంటి ప్రత్యేక వంటకాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది" అంటున్నారు నిర్వాహకులు. ఈ ఈవెంట్‌లో మహిళల కోసం కూడా ప్రత్యేక స్టాళ్ల ప్రదర్శన ఉంటుంది అని కూడా అధికారిులు తెలిపారు. ఈ ఫెస్టివల్‌కు లక్ష మందికి పైగా హాజరవుతారని అంచనా.

Trending News