Vivo Budget Phones: వివో నుంచి రెండు బడ్జెట్ ఫోన్లు, 50MP కెమేరా ఫోన్ కేవలం 9 వేలకే

Vivo Budget Phones: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో నుంచి మరో రెండు ఫోన్లు లాంచ్ అయ్యాయి. అద్బుతమైన ఫీచర్లు ఉండటమే కాకుండా ధర కూడా పూర్తిగా సామాన్యుడి బడ్జెట్‌కు అనుకూలంగా ఉండటం విశేషం. వివో లాంచ్ చేసిన రెండు వేరియంట్ల ఫీచర్లు, ధర వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 7, 2024, 06:21 PM IST
Vivo Budget Phones: వివో నుంచి రెండు బడ్జెట్ ఫోన్లు, 50MP కెమేరా ఫోన్ కేవలం 9 వేలకే

Vivo Budget Phones: భారత మొబైల్ మార్కెట్‌లో వివోకు ప్రత్యేక స్థానముంది. కెమేరా, డిజైన్ కారణంగా వివో స్మార్ట్‌ఫోన్లకు ఆదరణ ఎక్కువ. దానికితోడు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ మార్కెట్‌లో ప్రవేశపెడుతుంటుంది. తాజాగా ఒకేసారి రెండు మోడల్స్‌ను విడుదల చేసింది. VIVO Y18, VIVO Y18E. ఈ రెండు ఫోన్ల ప్రత్యేకతలు, ధర ఇతర వివరాలు తెలుసుకుందాం..

ఈ రెండు ఫోన్లు 6.56 ఇంచెస్ హెచ్‌డి ప్లస్ ఎల్‌సిడీ డిస్‌ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటాయి. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి85 ప్రోసెసర్‌తో పనిచేస్తాయి. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేసే ఈ ఫోన్లు కస్టమర్లకు మంచి అనుభూతిని అందిస్తాయి. కనెక్టివిటీ పరంగా చూస్తే 4జి ఇంటర్నెట్ సపోర్ట్ చేస్తుంది. ఇవి 5జి ఫోన్లు కావు. జీపీఎస్, బ్లూటూత్ 5.0, వైఫై సపోర్ట్ చేస్తాయి. ఐపీ 54 రేటింగుతో యాంటీ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. ఇక 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తూ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటాయి. 

Vivo Y18 స్మార్ట్‌ఫోన్‌ లో రెండు వేరియంట్లు ఉన్నాయి. 4జీబీ ర్యామ్-64 జీబీ స్టోరేజ్ కాగా రెండవది 4జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్‌తో వస్తోంది. Vivo Y18 అయితే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 0.08 మెగాపిక్సెల్ సెన్సార్, సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ కెమేరా కలిగి ఉంటుంది. అదే Vivo Y18E అయితే 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా కలిగి ఉంటుంది. 

Vivo Y18లో 4జీబీ ర్యామ్-64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 8,999 రూపాయలు కాగా 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అయితే 9,999 రూపాయలకు లభిస్తోంది. అదే  Vivo Y18Eలో 4జీబీ ర్యామ్-64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 7,999 రూపాయలుగా ఉంది. 

Also read: Amazon Offers: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ఇవాళే లాస్ట్, OnePlus Nord CE3పై భారీ డిస్కౌంట్

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News