Vivo Flying Camera Phone: 200MP డ్రోన్ కెమెరాతో మార్కెట్‌లోకి కొత్త Vivo మొబైల్‌.. ఫీచర్స్‌ చూస్తే ఆశ్చర్యపోతారు!

Vivo Flying Drone Camera Phone Price: ప్రముఖ టెక్ కంపెనీ వివో త్వరలోనే డ్రోన్ కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేయబోతోంది ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2024, 01:03 PM IST
Vivo Flying Camera Phone: 200MP డ్రోన్ కెమెరాతో మార్కెట్‌లోకి కొత్త Vivo మొబైల్‌.. ఫీచర్స్‌ చూస్తే ఆశ్చర్యపోతారు!

Vivo Flying Drone Camera Phone Price: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వివో అతి త్వరలోనే మరో శుభవార్త అందించబోతోంది. ప్రీమియం ఫీచర్స్ తో కూడిన అతిశక్తివంతమైన స్మార్ట్ ఫోన్ ను పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఫ్లయింగ్ డ్రోన్ కెమెరా (Vivo Flying Drone Camera) తో ఈ మొబైల్ మార్కెట్‌కి లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం.  ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతోపాటు ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ స్మార్ట్ ఫోన్ 200 మెగాపిక్సల్ ఫ్లయింగ్ డ్రోన్  ప్రధాన కెమెరాతో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఈ కెమెరా ఎంతో శక్తివంతమైన ప్రొఫెషనల్ గ్రేట్ ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ ఫీచర్ ను కూడా కలిగి ఉంటుంది. దీంతోపాటు ఒకే కెమెరాతో ఫ్రంట్ కెమెరాగా కూడా మలుచుకునే ఆప్షన్ కూడా అందిస్తోంది. నేచురల్‌ను చిత్రీకరించేందుకు ఎంతో ప్రత్యేకమైన లెన్సెస్‌ని కూడా అందించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఈ కెమెరా అనేక రకాల కొత్త ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నట్లు కొందరు టిప్ టిప్‌స్టర్‌ తెలిపారు.

ఈ స్మార్ట్ ఫోన్ ఎంతో శక్తివంతమైన డిస్ప్లేతో రాబోతున్నట్లు తెలుస్తోంది ఇది 7.1-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశాలున్నట్లు టెక్ టిప్‌స్టర్‌ చెబుతున్నారు. డిస్ప్లే1080 x 1980 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ లో ఎంత రిజర్వేషన్ కలిగిన వీడియోస్ నైనా ఫుల్ రిజల్యూషన్‌తో చూడవచ్చు. ఇక ఈ మొబైల్‌కు సంబంధించిన ప్రాసెసర్ విషయానికొస్తే.. ఇది ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ పై పని చేస్తుంది. దీంతోపాటు 12gb ర్యామ్ సెట్ అప్ తో అందుబాటులోకి రాబోతోంది. అలాగే మల్టీ టాస్కింగ్ చేసుకునేందుకు ఈ మొబైల్ ప్రాసెసర్ లో అధునాతన టెక్నాలజీని జతచేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ మొబైల్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read: Zodiac Signs: ఈ 5 రాశులవారు తమ భావొద్వేగాలను బయటకు కనిపించనివ్వరు.. మీ రాశి కూడా ఇదేనా?  

ఇక ఈ మొబైల్ కు సంబంధించిన ఆండ్రాయిడ్ విషయానికొస్తే.. ఇది ఆండ్రాయిడ్ 12పై పనిచేస్తుంది. దీంతోపాటు 6900 Mah బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. దాదాపు ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు నాన్ స్టాప్ ప్లే బ్యాక్ అందిస్తుంది. అలాగే ఇది 55 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. కాబట్టి కేవలం 10 నుంచి 25 నిమిషాలలోపే ఫుల్ చార్జింగ్‌ను పొందవచ్చు. కంపెనీ ఈ మొబైల్‌ను 2023 సంవత్సరంలోనే అధికారికంగా ప్రకటించగా.. కొన్ని కారణాలవల్ల మొబైల్ లాంచింగ్ తేదీని డిలే చేస్తూ వచ్చింది. అయితే ఇప్పటికీ ఈ మొబైల్ కు సంబంధించిన విడుదల తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. ఇక డ్రోన్ కెమెరా స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే దాదాపు రూ. 80 వేలకు పైగానే ఉండబోతున్నట్లు సమాచారం.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News