Buy Samsung Tv and Get Free Mobile: భారతదేశంలో సాంసంగ్ బిగ్ టీవీ డే సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ లో భాగంగా 40 రోజులపాటు టీవీలను విక్రయించబోతున్నట్లు అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. ఈ సేల్ లో సాంసంగ్ సంబంధించిన అన్ని మోడల్స్ టీవీ లపై దాదాపు 20,000 వరకు క్యాష్ బ్యాక్ లభించనంది. అంతేకాకుండా 55 ఇంచుల డిస్ప్లే గల టీవీని కొనుగోలు చేస్తే.. ఉచితంగా సాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా, సౌండ్ బార్లను పొందవచ్చు. ఈ సేల్ లో అన్ని వస్తువులపై 25% వరకు డిస్కౌంట్ లభించబోతోంది. అయితే మీరు కూడా టీవీలు కొనుగోలు చేయాలనుకుంటే ఈ ఆఫర్స్ సరైనదని చెప్పవచ్చు. ఈ ఆఫర్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
బిగ్ టీవీ డేస్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్:
ఈ సేల్ లో భాగంగా సాంసంగ్ టీవీలపై ఇతర ఎలక్ట్రిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది కంపెనీ. సాంసంగ్ సంబంధించిన Neo QLED 8K, Neo QLED, QLED, OLED, The Frame, Crystal 4K UHD టీవీలపై భారీ తగ్గింపు ధరలతో లభించనున్నాయి. ఈ స్మార్ట్ టీవీలను బిగ్ టీవీ డేస్ కొనుగోలు చేస్తే గరిష్టంగా రూ. 20,000 వరకు తగ్గింపు పొందుతారు. అంతేకాకుందా ఈ సేల్‌లో చాలా రకాల వస్తువులపై ఆఫర్స్ నడుస్తున్నాయి. మరింత సమాచారం కోసం అధికారిక సాంసంగ్ వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్
ఈ సేల్‌లో ఉచిత Samsung Galaxy S23 అల్ట్రా..!
బిగ్ టీవీ డేస్ సేల్‌లో 98-అంగుళాల సాంసంగ్ స్మార్ట్ టీవీని కొనుగోలు చేస్తే.. Samsung Galaxy S23 Ultra స్మార్ట్‌ఫోన్‌ను ఉచితంగా పొందుతారు. అంతేకాకుండా Chebol హోమ్ సినిమా సిస్టమ్ కూడా ఉచితంగా పొందవచ్చు. 85-అంగుళాల నియో QLED టీవీతో పాటు 8K, Neo QLED, QLED, OLED మోడల్స్ టీవీలను కొనుగోలు చేస్తే ఉచిత Samsung ఫ్రీస్టైల్ ప్రొజెక్టర్ కూడా పొందవచ్చు. ఇందులో సర్టిఫైడ్ OTT యాప్‌లు, ఎయిర్‌ప్లే సపోర్ట్, HDR10, ఇన్ బిల్ట్ స్పీకర్లు వంటి చాలా రకాల ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
ఉచిత సౌండ్‌బార్ ఆఫర్:
ఈ సేల్‌లో సాంసంగ్ 75-అంగుళాల Neo QLED 8K స్మార్ట్ టీవీని కొనుగోలు చేస్తే..టీవీలతో పాటు ఉచిత HW-S800B, HW-Q600B సౌండ్‌బార్‌లను కూడా పొందవచ్చు. రూ. 51,990 విలువైన Crystal 4K UHD TVని కొనుగోలు చేసేవారికి రూ. 28,990 విలువగల Q600B సౌండ్‌బార్‌ను ఉచితంగా ఈ సేల్‌లో లభిస్తుంది. బిగ్ టీవీ డేస్ సేల్‌లో OLED TV విక్రయాలపై HW-B450 సౌండ్‌బార్‌ను ఉచితంగా అందించబోతునట్లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.
Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి