Redmi Turbo 3 Release Date: ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ కంపెనీ రెడ్‌మీ నుంచి మరో కొత్త మొబైల్ విడుదలకు సిద్ధమయింది. కంపెనీ ఈ లాంచింగ్ మొబైల్ కు సంబంధించిన మోడల్ కూడా వెల్లడించింది. ఇది Redmi Turbo 3 పేరుతో ప్రపంచ మార్కెట్లోకి విడుదల కాబోతోంది. కంపెనీ ముందుగా ఈ స్మార్ట్ ఫోన్ ను చైనా మార్కెట్ లోకి విడుదల చేసి అతి త్వరలోనే ప్రపంచ మార్కెట్లోకి లాంచ్ చేయబోతున్నట్లు తెలిపింది. అయితే దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ విడుదలకు ముందే ఫీచర్స్ తో పాటు స్పెసిఫికేషన్స్ కూడా లీకైనట్లు సమాచారం. లీకైన వివరాల ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ అతి శక్తివంతమైన ప్రాసెసర్‌తో పాటు ఫీచర్లను కలిగి ఉండబోతోంది. అంతేకాకుండా బ్యాక్ సెట్ అప్‌లో ప్రీమియం త్రిపుల్ కెమెరాతో అందుబాటులోకి రాబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ఇతర ఫీచర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Weiboలో టిప్‌స్టర్ తెలిపిన వివరాల ప్రకారం Redmi Turbo 3 స్మార్ట్ ఫోన్ వెనుక ప్యానెల్ ఎడమ వైపున రెండు కెమెరాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ కెమెరా లతో పాటు రౌండ్ LED ఫ్లాష్ కూడా అందుబాటులోకి వచ్చింది. వెనక భాగంలో ఈ మొబైల్ పై సిల్వర్ కలర్ లో చిన్న అక్షరాలలో Redmi బ్రాండింగ్ ప్యానెల్ ను కూడా కలిగి ఉంటుంది. దీంతోపాటు బ్యాక్ సెటప్ ఎంతో ఆకర్షణీయమైన డిజైన్తో కనిపిస్తుంది. అలాగే ఈ మొబైల్ వెనుక భాగంలో త్రిపుల్ కెమెరా సెట్ అప్ ఉండడంతో ఆకర్షణీయమైన లుక్కులో కనిపిస్తుంది.
రెడ్మీ టర్బో 3 స్మార్ట్ ఫోన్ లీకైన ఫీచర్స్:
GMMArena వెబ్సైట్ అందించిన వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్ ఫోన్ అత్యంత శక్తివంతమైన 200 మెగాపిక్సెల్ కెమెరా సెట్ అప్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతోపాటు ఈ కెమెరాకు అద్భుతమైన ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) టెక్నాలజీ సపోర్టు కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఇది సెకండరీ కెమెరాతో పాటు మైక్రో లెన్స్ కెమెరా ను కలిగి ఉంటుంది. అయితే ఈ మైక్రో లెన్స్ అత్యాధునిక టెక్నాలజీతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొంతమంది టిప్ స్టర్స్ తెలిపిన వివరాల ప్రకారం, కంపెనీ ఈ మొబైల్లో మొత్తం రెండు కలర్ ఆప్షన్స్ లో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.
ఇతర ఫీచర్ వివరాలు:
Redmi Turbo 3 స్మార్ట్ ఫోన్ అత్యంత శక్తివంతమైన 6000mAh బ్యాటరీతో అందుబాటులోకి రాబోతోంది. దీంతోపాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే అద్భుతమైన 6.78-అంగుళాల OLED డిస్ప్లే తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీని స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండబోతోంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ప్రాసెసర్ వివరాల్లోకి వెళితే, ఇది ఎంతో శక్తివంతమై నQualcomm యొక్క కొత్త Snapdragon 8s Gen 3 ప్రాసెసర్‌పై పనిచేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ను కంపెనీ చైనాలో ఈ నెల లేదా వచ్చేనెల రెండవ వారంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Redmi New Mobile: చీప్ ధరకే రెడ్‌మీ నుంచి 200MP కెమెరాతో మరో మొబైల్.. ఫీచర్స్, డిజైన్ లీక్..