Reduce Electricity Bill with These Small Device: ఎండా కాలం వచ్చిందంటే కరెంటు బిల్లు తడిసి మోపుడవుతుంది. వేసవిలో ఉక్కపోత కారణంగా ఫ్యాన్, ఏసీ, కూలర్లు ఎక్కువగా ఉపయోగిస్తాం. దీంతో పవర్ బిల్లు భారీగా వస్తుంది. ఇది సామాన్యులకు భారమనే చెప్పాలి. విద్యుత్‌ను ఆదా చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కవుట్ అవ్వడం లేదా.. అయితే కరెంటు బిల్లు తగ్గించే ఓ పరికరం గురించి చెప్పబోతున్నాం. ఇది నచ్చితే మీరు మీ ఇంట్లో వాడేయండి.
ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా సౌరశక్తి వినియోగం అధికమైంది. ప్రభుత్వం కూడా సోలాన్ ఎనర్జీని ప్రోత్సాహిస్తుంది. అంతేకాకుండా వీటి కొనుగోలుపై భారీగా రాయితీలు, సబ్సిడీలను కూడా ఇస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో సోలార్ లైట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించడం వల్ల చాలా వరకు కరెంటు బిల్లు ఆదా అవుతుంది.
సోలార్ లైట్
Hardoll కంపెనీకి చెందిన ఎల్ఈడీ వాటర్‌ప్రూఫ్ ఫెన్స్ సోలార్ లైట్ లాంప్ చాలా వరకు మీ విద్యుత్ బిల్లును తగ్గిస్తుంది. దీని ధర రూ.443. ఈ లైట్ను మీరు మీ టెర్రస్, గార్డెన్ లేదా మీ ఇంటి బాల్కనీలో బిగించుకుని వెలుతురును పొందవచ్చు. ఇది కరెంట్ పోయినా దాని అదే ఆన్ అవుతుంది. సూర్యకాంతి దానిపై పడినప్పుడు దానికదే ఆఫ్ అవుతుంది. ఈ లైట్‌ను 6 గంటలు ఛార్జ్ చేస్తే 18 గంటలపాటు వెలుగును ఇస్తుంది. మీరు మీ ఇంట్లో పెద్ద సైజు సోలార్ ప్యానెల్‌ను అమర్చినట్లయితే.. దాని సహాయంతో మీరు కరెంటు లేకపోయినా విద్యుత్ ను పొందవచ్చు. ఇంట్లో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి కరెంటు బిల్లు ఖర్చు ఉండదు.
Also Read: How to Beat the Heat: వేసవిలో శరీరంలో వేడి తగ్గాలంటే ఏం చేయాలి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి