Oneplus - Ai Eraser Feature: వన్‌ప్లస్‌ యూజర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. ఇక నుంచి ఫ్రీగా AI ఎరేజర్ ఫీచర్స్‌ పొందండి!

Oneplus - Ai Eraser Feature: వన్‌ప్లస్‌ వినియోగదారకు కంపెనీ గుడ్‌ న్యూస్‌ తెలిపింది. తమ వినియోగదారులకు వన్‌ప్లస్‌ కొత్త  AI ఇమేజ్ ఎడిటింగ్ ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ ఫీచర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.    

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 4, 2024, 10:37 AM IST
Oneplus - Ai Eraser Feature: వన్‌ప్లస్‌ యూజర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. ఇక నుంచి ఫ్రీగా AI ఎరేజర్ ఫీచర్స్‌ పొందండి!

Oneplus - Ai Eraser Feature: భారతదేశంలో పెద్ద స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్స్‌లో వన్‌ప్లస్‌ ఒకటి..ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి ప్రత్యేకమై గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్స్‌ ఇప్పటికీ చాలా మంది యువత కొనుగోలు చేస్తున్నారు. అయితే కంపెనీ దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌కి AI ఫీచర్స్‌ ఆప్డేట్‌ అందించింది. కొత్తగా అన్ని స్మార్ట్‌ఫోన్స్‌లో AI ఎరేజర్ అనే ఫీచర్‌ను లాంచ్‌ చేసింది. ఇది AI ఇమేజ్ ఎడిటింగ్ ఫీచర్స్‌.. ఇందులో అన్ని రకాల ఫోటోస్‌ను సులభంగా వన్‌ క్లిక్‌తో ఎడిటింగ్‌ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఫీచర్‌తో పిక్స్‌కి అవసరమైన వస్తువులను సులభంగా అటాచ్‌ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఫీచర్స్‌తో ఫోటోస్‌ను అందంగా తయారుకోవచ్చు. అయితే ఈ ఫీచర్‌ను పాత వన్‌ప్లస్‌ వినియోగదారులు ఎలా పొందాలో తెలుసుకోండి.  

వీరికే ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది:
వన్‌ప్లస్‌ కంపెనీ ఈ AI ఎరేజర్ ఫీచర్‌ను మొదట కొన్ని ఫోన్స్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిని వన్‌ప్లస్‌ 12, 12R, 11, Nord CE 4తో పాటు కొన్ని మోడల్స్‌లో అందుబాటులోకి తీసుకువచ్చిన్నట్లు కంపెనీ వెల్లడించింది.  ఈ కొత్త ఏఐ ఫీచర్‌ ఏప్రిల్‌లో ఎప్పుడైనా అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది. అయితే ఈ ఫీచర్‌ను పొందడానికి సిస్టమ్ అప్‌డేట్‌ ద్వారా పొందవచ్చు. దీంతో పాటు ఫోటోస్‌లో బ్యాక్‌ రౌండ్‌ను కూడా సులభంగా తీసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. 

అలాగే ఈ ఫీచర్‌ను గూగుల్‌ గతంలో సాంసంగ్‌ ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్‌లో లాంచ్‌ చేసింది. అయితే ఇటీవలే వన్‌ప్లస్‌లో కూడా విడుదల చేసింది. అంతేకాకుండా గూగుల్‌ వన్‌ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వారికి Magic Eraser Pixel అనే ఫీచర్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే వన్‌ప్లస్‌ మొబైల్స్‌ మాత్రం ఎంతో శక్తివంతమైన AI ఎరేజర్ ఫీచర్‌ అందుబాటులోకి రావడం విశేషం. అయితే ఈ టూల్‌ను నెమ్మదిగా వన్‌ప్లస్‌కి సంబంధించిన అన్ని స్మార్ట్‌ఫోన్స్‌లో లాంచ్‌ చేయబోతున్నట్లు తెలిపింది. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

AI ఎరేజర్ లో చాలా ముఖ్యమైన ఫీచర్లు :
1. వస్తువులను తొలగించడం: 

ఫోటోల నుంచి ఫోటో బాంబర్లు, వాటర్‌మార్క్‌లు, పవర్ లైన్‌లు వంటి Objectలను సులభంగా తొలగించడానికి ఈ ఫీచర్ మిమ్మల్ని అనుమతిస్తుంది.

2. ఈ టూల్ కూడా వినియోగించుకోండి: 
మీరు తొలగించాలనుకుంటున్న ప్రాంతాన్ని ఖచ్చితంగా ఎంచుకోవడానికి AI ఎరేజర్ బ్రష్, లాసో టూల్స్‌ టూల్‌ కూడా సహాయపడుతుంది.

3. సులభంగా వినియోగించవచ్చ: 
AI ఎరేజర్ చాలా సులభంగా ఉపయోగించడానికి వన్‌ప్లస్‌ రూపొందించింది. ఈ ఫీచర్‌ను వినియోగించడానికి ఫోటో ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫోటోస్‌లో తొలగించాల్సిన Objectలను ఎంచుకోండి, అంతే!

4. శక్తివంతమైన AI:

AI ఎరేజర్ చాలా శక్తివంతమైన AI అల్గోరిథంలను ఉపయోగిస్తుంది.  కాబట్టి దీంతో చాలా క్లిష్టమైన నేపథ్యాలతో కూడా ఫోటోలలోని వస్తువులను సులభంగా తొలగించడానికి సహాయపడుతుంది.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News