OnePlus Nord 4: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్..నార్డ్ సిరీస్‌లో వరుసగా స్మార్ట్‌ఫోన్లు లాంచ్ చేస్తోంది. ఇటీవల OnePlus Nord CE 4 lite లాంచ్ చేయగా ఇప్పుడు OnePlus Nord 4 లాంచ్‌కు సిద్ధమౌతోంది. మరో ఐదు రోజుల్లో అంటే జూలై 16న ఇండియాలో లాంచ్ కానుంది.
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో OnePlus అంటే ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. ఇప్పుడు లాంచ్ కానున్న OnePlus Nord 4 ధర, ఫీచర్లు అప్పుడే లీకయ్యాయి. గత ఏడాది లాంచ్ అయిన OnePlus Nord 3 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ 6.74 ఇంచెస్ పరిమాణంలో 1.5 కే ఎమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో స్నాప్ డ్రాగన్ 7 ప్లస్ జనరేషన్ 3 చిప్‌సెట్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడమే కాకుండా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది.
OnePlus Nord 4 అనేది మెటల్ యూనిబాడీ డిజైన్‌తో వస్తుందని ఇంతకుముందే కంపెనీ ధృవీకరించింది. డ్యూయల్ ఫోన్ ఫినిషింగ్ కలిగిన ఈఫోన్‌లో 8 జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో ప్రైమరీ కెమేరా 50 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమేరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ కెమేరా ఉంది.
OnePlus Nord 4 ప్రారంభ ధర 30,999 రూపాయలుండవచ్చని తెలుస్తోంది. లేదా 31,999 రూపాయలుంటుంది. OnePlus Nord 3లో 8జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ వెర్షన్ 33,999 రూపాయలుగా ఉంటే 16జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ ధర 37,999 రూపాయలుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook