Oneplus 13: త్వరలోనే ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ గుడ్‌న్యూస్ అందించబోతోంది. ప్రతి సంవత్సరం విడుదల చేసి కొత్త మొబైల్ సిరీస్‌లో భాగంగా ఈ సంవత్సరం కూడా మరో స్మార్ట్‌ఫోన్‌ను తమ కస్టమర్స్‌కి అందిచబోతోంది. వన్‌ప్లస్ కంపెనీ త్వరలోనే 13 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయబోతోంది. ఇది శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్‌తో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు ఇందులో అనేక శక్తివంతమైన ఫీచర్స్ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ సెల్యులార్ నెట్‌వర్క్ లేదా ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా ఎంతో సులభంగా పని చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇవే కాకుండా మరెన్నో శక్తివంతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ శాటిలైట్ కనెక్టివిటీనితో అందుబాటులోకి రావడమే కాకుండా ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఇది Android 15 బీటా 2 అప్‌డేట్ వెర్షన్‌పై రన్ అవుతుందని మార్కెట్‌లో టాక్. అంతేకాకుండా అత్యవసర కాలింగ్ సపోర్ట్‌తో పాటు SMS ద్వారా డేటాను బదిలీ చేసుకునే ప్రత్యేకమైన ఫీచర్స్ కూడా అందించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన కెమెరా సెటప్‌తో లభించబోతోంది.
శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్స్:
వన్‌ప్లస్ మొట్టమొదటి సారిగా శాటిలైట్ కనెక్టివిటీతో వన్‌ప్లస్ 13 మొబైల్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇప్పటికే ఐఫోన్ 15 ప్రో మాక్స్, ఇతర ప్రీమియం బ్రాండ్ మొబైల్స్ ఈ ఫీచర్ అందుబాటులో ఉండేది. శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ ఎప్పుడు ట్రెక్కింగ్, ప్రయాణాలు చేసేవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మారుమూల ప్రాంతాల్లో జీవించేవారికి కూడా ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది సిమ్ కార్డ్ లేకపోయిన కూడా ఎంతగానో పని చేస్తుందని పలువురు టిప్‌స్టర్స్ తెలుపుతున్నారు.
వన్‌ప్లస్ కంపెనీ తమ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్స్ ఏడాది చివరి నెలలో లాంచ్ చేయడం ఆనవాయితిగా వస్తోంది. అయితే ఈ వన్‌ప్లస్ 13 మొబైల్‌ను కూడా అప్పుడే గ్లోబల్ లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కంపెనీ దీనిని ముందుగా చైనా మార్కెట్‌లో లాంచ్ చేసి ప్రపంచ మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దీని బట్టి చూస్తే వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ నెలలో లాంచ్ కాబోతున్నట్లు సమాచారం.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
OnePlus 13 మొబైల్ స్పెసిఫికేషన్:
6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే
Qualcomm Snapdragon 8 Gen 4 ప్రాసెసర్
5000mAh కెపాసిటీ బ్యాటరీ
50MP ట్రిపుల్ కెమెరా సెటప్
12GB RAM ర్యామ్
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి