Youtube To Split Video Content: వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ కొత్త అప్డేట్ను ప్రకటించింది. ఇక నుంచి యూట్యూబ్ అన్ని ఛానెల్స్‌లో వీడియో కంటెంట్‌ను లాంగ్, షార్ట్‌లు, లైవ్ స్ట్రీమ్ మూడు వేర్వేరు ట్యాబ్‌లుగా విభజించింది. ఇక నుంచి మూడు ట్యాబ్‌లు వేర్వేరుగా కనిపిస్తాయి. అవి ఎలా పనిచేస్తాయో ఓసారి చూద్దాం..
ఇప్పటివరకు మనం ఏదైనా ఓ యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేస్తే.. అన్ని వీడియోలు ఒకే ఫీడ్‌గా వరుసగా కనిపించేవి. వాటిలో ఏ వీడియో ఎక్కడుందో వెతుక్కునేందుకు కాస్తా టైమ్ పట్టేది. అందుకు ఇక నుంచి అలా వెతక్కోవాల్సిన అవసరం లేకుండా యూట్యూబ్ సరికొత్త అప్డేట్ను వినియోగదారులకు పరిచయం చేయబోతుంది.
ఇక నుంచి లాంగ్ వీడియోలు, షార్ట్, లైవ్ స్ట్రీమ్ ఇలా మూడు ట్యాబ్‌లకు సపరేట్గా అప్లోడ్ చేయవచ్చు. దీని వల్ల యూట్యూబ్ ఛానెల్లోకి వచ్చిన వినియోగదారుడు తన కావాల్సిన కంటెంట్‌ను సులభంగా చూడొచ్చు. ఏ వీడియోలు కావాలంటే ఆ ట్యాబ్‌కు వెళితే సరిపోతుంది. దీంతో చాలా టైమ్ అవుతుంది.
ఈ ఫీచర్ ఇప్పటికే కొందరికి అందుబాటులోకి వచ్చింది. మిగిలిన యూజర్లకు కూడా త్వరలోనే అందుబాటులోకి రానుంది. వినియోగదారులు ఛానెల్ పేజీని సందర్శించినప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉన్న కంటెంట్ రకాలను ఈజీగా కనిపెట్టేందుకు ఈ అప్డేట్ సులభతరం చేస్తుందని యూట్యూబ్ తెలిపింది.
అంతేకాకుండా యూట్యూబ్ ఛానెల్ పేజీ వివరాల లుక్ కూడా ఛేంజ్ చేస్తోంది. లైక్, డిస్లైక్, షేర్ బటన్స్ లుక్ కాస్త మార్చగా.. డార్క్ మోడ్ మరింత డార్క్‌గా కనిపించేలా అప్డేట్ ఇచ్చింది. యాంబియెంట్ మోడ్‌ను యూజర్స్‌కు పరిచయం చేసింది.
యూట్యూబ్‌లో యూజర్స్‌కు మరింత అనుభూతిని అందించేందుకు వీడియోల కోసం జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకునేలా అప్డేట్ చేసింది. ఈ ఫీచర్స్ అన్ని అక్టోబర్ 25వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చాయి.
Also Read: Petrol For Cheap Cost: తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్.. ఈ చిన్న ట్రిక్ ఉపయోగించండి
Also Read: నవాజ్ వేసిన బంతి అలా పడుంటే.. వెంటనే రిటైర్మెంట్ ఇచ్చేవాడిని! అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook