Apple iPhone 13 Flash Deal: యాపిల్, ఆండ్రాయిడ్ ఈ రెండిట్లో ఏ ఫోన్ కావాలి అంటే 99 శాతం యాపిల్ ఫోన్ కావాలని అంటున్నారు. ఒకరకంగా 'ఆపిల్ ఐఫోన్' అంటే ఇష్టపడని వారుండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే యాపిల్ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త సిరీస్ తీసుకువస్తూనే ఉంటుంది. అందుకే ఆ యాపిల్ నుంచి కొత్త సిరీస్ ఫోన్ వచ్చిందంటే మొబైల్ ప్రియులు కొనుగోలు చేసేందుకు ఎంతో ఆసక్తిగా చూపిస్తారు. ప్రస్తుతం ఐఫోన్ 14 రావడంతో ఐఫోన్ 13 కొంచెం రేటు తగ్గింది.
ఈ క్రమంలో ఆ సిరీస్ ఫోన్ కోసం అందరూ ఎగబడుతున్నారు. అయితే ఈ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇంతకంటే మంచి సమయం మరోసారి రాదు, అందుకటే ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఓ సూపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈరోజు, మీరు Apple iPhone 13 కొనాలంటే ఏకంగా రూ. 30,000 ఆదా చేయగలుగుతారు. ఫ్ఫ్లిప్‌కార్ట్ రూ. 69,900 ధర కలిగిన హాట్-సెల్లింగ్ iPhone 13పై భారీ తగ్గింపు అలాగే ఎక్స్ ఛేంజ్ ఆఫర్ ప్రకటించింది.
Apple iPhone 13 యొక్క 128 GB వేరియంట్ ప్రస్తుతం ఉన్న ఆఫర్‌లతో సహా ఫ్లిప్‌కార్ట్‌లో ధర రూ.38,999 వద్ద అందుబాటులో ఉంది. iPhone 13 11% తగ్గింపుతో లభిస్తుంది, అక్కడ దీని ధర రూ. 61,999, అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందడం ద్వారా ధరను మరింత తగ్గించవచ్చన్న మాట అలా వినియోగదారులు Apple iPhone 13ని రూ. 38,999 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు.
ఎక్స్ ఛేంజ్ తర్వాత, కస్టమర్లు రూ. 23,000 వరకు ధర తగ్గింపు పొందవచ్చు. అయితే ఈ ధర తగ్గింపు అనేది మీరు ఎక్స్ఛేంజ్ చేస్తున్న ఫోన్ మోడల్, దాని వర్కింగ్ స్టేజ్ పై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అంటే అన్నీ సరిగా ఉంటే Apple iPhone 13 యొక్క 128 GB వేరియంట్‌ను ఫ్లిప్‌కార్ట్ నుండి రూ. 38,9999 వద్ద, రూ. 30,000 కంటే ఎక్కువ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చన్న మాట.
ఇక Apple iPhone 13 స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే ఇది కంపెనీ ఫ్లాగ్‌షిప్ A15 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్ 4K డాల్బీ విజన్ HDR రికార్డింగ్‌తో 12MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది నైట్ మోడ్‌తో 12MP TrueDepth ఫ్రంట్ కెమెరాను కూడా అందిస్తుంది. ఇక ఈ ఐ ఫోన్ 17 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
Also Read: Taraka Ratna Last Photo: ఇదే చివరి ఫోటో అవుతుంది అనుకోలేదు...తారకరత్న ఫోటో షేర్ చేసి కన్నీరు తెప్పిస్తున్న అలేఖ్య!
Also Read: HCA Clarity on Jr NTR issue: ఎన్టీఆర్ పై కుట్ర..పిలిచాం కానీ రాలేదంటూ హెచ్సీఏ షాకింగ్ ట్వీట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి