Yuvraj Singh-Hazel Keech: తండ్రయిన యువరాజ్ సింగ్... పండంటి బిడ్డకి జన్మనిచ్చిన హేజెల్ కీచ్..

Yuvraj Singh: టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి అయ్యాడు. అతడి భార్య హేజెల్ కీచ్ పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. ఇప్పుడు ఈ వార్త వైరల్ గా మారింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2022, 07:36 AM IST
  • తండ్రయిన భారత క్రికెటర్ యువరాజ్ సింగ్
  • సోషల్ మీడియా ద్వారా వెల్లడి
Yuvraj Singh-Hazel Keech: తండ్రయిన యువరాజ్ సింగ్... పండంటి బిడ్డకి జన్మనిచ్చిన హేజెల్ కీచ్..

Yuvraj Hazel baby boy: టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌-హేజల్‌ కీచ్‌ (Yuvraj Singh-Hazel Keech) దంపతులు గుడ్ న్యూస్ చెప్పారు. పండంటి మగ బిడ్డకు (baby boy) జన్మనిచ్చినట్లు వారు సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. ‘''మాకు పండంటి మగ బిడ్డ జన్మించాడు. ఈ విషయాన్ని అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోవడం ఆనందంగా ఉంది. దేవుడికి కృతజ్ఞతలు. ఈ సందర్భంగా మా గోప్యతకు ఎలాంటి భంగం కలిగించకూడదని కోరుకుంటున్నాం''’ అని యువరాజ్‌ (Yuvraj Singh) ట్వీట్‌ చేశారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

2000 సంవత్సరంలో కెన్యాతో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు యువరాజ్. భారత్‌ తరఫున యువీ 304 వన్డేలు, 40 టెస్ట్‌లు, 58 టీ20లు ఆడాడు. భారత్‌ సాధించిన రెండు ప్రపంచకప్‌లు 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌లో సభ్యుడిగా ఉన్నాడు. 2019 జూన్‌ 10న అన్ని ఫార్మాట్ల నుంచి వైదులుగొతున్నట్లు ప్రకటించాడు. దాదాపు యువీ 19 ఏళ్లపాటు భారత జట్టుకు సేవలందించాడు. బ్రిటిష్‌-మారిషియస్‌ నటి, మోడల్‌ అయిన హేజల్‌ కీచ్‌ను (Hazel Keech) 2016లో యువరాజ్‌ సింగ్‌ వివాహమాడారు.

Also Read: Lucknow IPL Team Name: లక్నో సూపర్ జెయింట్స్.. టీమ్ పేరు ప్రకటించిన లక్నో ఫ్రాంచైజీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News