WTC Points Table Updates: రాజ్‌కోట్ టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించడంతో.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో తిరిగి రెండో స్థానానికి చేరుకుంది. గత వారం దక్షిణాఫ్రికాపై రెండు టెస్టులు గెలిచిన న్యూజిలాండ్ డబ్ల్యూటీసీ టేబుల్ లో అగ్రస్థానం దక్కించుకోగా.. తొలి స్థానంలో ఉన్న ఆసీస్ రెండో స్థానానికి పడిపోయింది. తాజా గెలుపుతో మూడో స్థానంలో ఉన్న టీమిండియా రెండో స్థానానికి ఎగబాకింది.
డబ్ల్యూటీసీ 2023-25లో భాగంగా.. ఏడు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ సేన.. నాలుగు గెలిచి రెండింట్లో ఓడి ఒకటి డ్రా చేసుకుంది. కివీస్ నాలుగు ఆడి మూడు గెలిచి ఒకటి ఓడింది. ఆస్ట్రేలియా 10 టెస్టు మ్యాచ్లు ఆడి ఆరింట్లో గెలిచి మూడు ఓడి ఒకటి డ్రా చేసుకుంది. 75 శాతంతో న్యూజిలాండ్ తొలి స్థానంలోనూ, 59.52 శాతంతో టీమిండియా రెండో ఫ్లేస్ లోనూ, 55 శాతంతో ఆస్ట్రేలియా మూడో స్థానంలోనూ కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్, వెస్టిండీస్, సౌతాఫ్రికాలు తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. మూడో టెస్టులో ఓడిపోయిన ఇంగ్లండ్ 21.88 శాతం విజయాలతో 8వ స్థానంలో నిలిచింది.
రాజ్ కోట్ టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. రోహిత్ సేన నిర్దేశించిన 557 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 122 పరుగులకే కుప్పకూలింది ఇంగ్లండ్ జట్టు. దీంతో భారత్ జట్టు 434 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 445 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 319 రన్స్‌కే పరిమితమైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. జైస్వాల్ డబుల్ సెంచరీతో 430/4 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది. ఐదు టెస్టుల సిరీస్ లో భారత్ ప్రస్తుతం 2-1 లీడ్ లో ఉంది.
Also Read: ఇంగ్లీష్ బౌలర్లను ఊచకోత కోసిన యశస్వి.. వరుసగా రెండో డబుల్ సెంచరీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి