మోడలింగ్‌లో అడుగుపెట్టిన ప్రముఖ క్రికెటర్ భార్య

పిల్లల పోషణ కోసం మోడలింగ్‌లోకి ప్రముఖ క్రికెటర్ భార్య

Last Updated : Jul 8, 2018, 04:03 PM IST
మోడలింగ్‌లో అడుగుపెట్టిన ప్రముఖ క్రికెటర్ భార్య

లైంగిక ఆరోపణలు, గృహ హింస కేసుల్లో క్రికెటర్ మొహమ్మద్ షమీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించిన అతని భార్య హసీన్‌ జహాన్ మళ్లీ వార్తల్లో నిలిచారు. నాలుగు నెల తరువాత ఆమె తిరిగి ఆమె తన కెరీర్ వైపు దృష్టి సారించారు. మోడలింగ్ రంగంలో దిగిపోయారు. ఈ క్రమంలో ఆమె కోల్‌కతాలో నిర్వహించిన ఓ ఫ్యాషన్‌ షోలో ర్యాంప్‌ వాక్‌తో సందడి చేశారు.

'షమీ కోసం నా కెరీర్, కలలు.. ఇలా అన్నింటినీ వదిలేశా. కానీ అతడు నన్ను ఇప్పుడు ఒంటరిగా వదిలేశాడు. అందుకే మోడలింగ్ లోకి తిరిగి వచ్చేశా. ప్రస్తుతం మోడలింగ్‌ కోసం కోల్‌కతాతో పాటు ఇతర నగరాల్లో అవకాశాలు వస్తున్నాయి’ అని జహాన్‌ ఒక మీడియా ఛానల్ తో మాట్లాడారు. మొదట మోడలింగ్ చేయాలంటే ఇబ్బందిగా అనిపించిందని..కానీ పిల్లల కెరీర్ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అడుగుపెట్టానని తెలిపింది.

ఇటీవల హసీన్ జహాన్ భర్త షమీ, అతని కుటుంబ సభ్యులపై ఫిక్సింగ్, గృహ హింస తదితర ఆరోపణలు చేసింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని, ఢిల్లీ డేర్ డెవిల్స్ యాజమాన్యం, బీసీసీఐలను కలిసి తనకు న్యాయం చేయాలని కోరింది. కుమార్తె పోషణ కోసం రూ.10 లక్షల భరణం ఇప్పించాలంటూ కోల్‌కతా కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసు వివాదం కోర్టులో నడుస్తోంది.

గతంలో మోడల్‌గా, కోల్‌కతా నైట్‌రైడర్స్ మాజీ చీర్ లీడర్ గా పనిచేసిని హసీన్... 2014లో షమీతో వివాహం తరువాత మోడలింగ్‌ను విడిచిపెట్టేసింది.

 

Trending News