టీమ్ ఇండియాలో ( Team India ) ఫిట్నెస్ కు అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చే క్రికెటర్లలో కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ) అందరి కన్నా ముందుంటాడు. ఎలాంటి చెడు అలవాట్లు లేని విరాట్ కోహ్లీ ఎప్పటికప్పుడు ఫిట్ గా ఉండటానికి ప్రయత్నిస్తాడు. ఫిట్నెస్ కోసం కొత్త లెవల్స్ ప్రయత్నాలు కూడా చేస్తుంటాడు. అంతే కాదు చాలా కష్టం అనబడే 180 డిగ్రీల ల్యాండింగ్ వర్కవుట్ చేసి ఔరా అనిపించాడు కోహ్లీ. అంతే కాదు ఫ్యాన్స్ లో మోటివేషన్ కలిగేలా తన విరాట్ కోహ్లీ తన ఫిట్నెస్ వీడియోలను ( Virat kohli Workout Video ) తరచూ షేర్ చేస్తుంటాడు
Smriti Mandhana: స్మృతి మంథాన గురించి 10 ఆసక్తికరమైన విషయాలు
IPL 2020 UAE Facts: క్రకెటర్స్ భద్రత కోసం తీసుకోనున్న చర్యలివే
Cricketers Talent: మన క్రికెటర్లు క్రికెటర్స్ కాకపోయి ఉంటే ఏం చేసేవాళ్లో తెలుసా?
తాజాగా విరాట్ కోహ్లీ మరో ఫిట్నెస్ వీడియోను షేర్ చేశాడు. ఇందులో విరాట్ తన ఆబ్స్ ఎలా ( Virat Kohli Abs ) ఉంటాయో ఫ్యాన్స్ కు చూపించాడు. కొవ్వు ఏ మాత్రం లేకుండా తెగ జాగ్రత్త తీసుకున్నాడు విరాట్ అంటూ చాలా మంది పొగుడుతున్నారు. చూడబోతే... కరోనావైరస్ ( Coronavirus ) వల్ల కొంత కాలం లాక్ డౌన్ ఉండటంతో.. ఆ సమయంలో ఎక్కువగా ఫిట్నెస్ గోల్ సాధించడానికి స్పెండ్ చేశాడేమో కోహ్లీ. ఐపీఎల్ 2020 ( IPL 2020 ) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న కోహ్లీ నవంబర్ ల్ యూఏఈ ( IPL 2020 in UAE ) లో జరిగే మ్యాచులకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.
Men's Tips For Beard: గడ్డం పెంచడానికి పాటించాల్సిన టిప్స్ ఇవే
Virat Kohli: విరాట్ కోహ్లీ సిక్స్ ప్యాక్ వీడియోకు ఫ్యాన్స్ ఫిదా