IPL 2022 Auction: ఐపీఎల్ మెగా లీగ్ వేలం ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. గతంలో తక్కువ మొత్తం పొందిన కొందరు ప్లేయర్స్... ఈ సారి భారీ ధరను సొంతం చేసుకుని రికార్డ్‌లు బద్దలు కొడుతున్నారు. ఇప్పటి దాకా జరిగిన వేలంలో టీమిండియా క్రికెటర్ ఇషాన్ అత్యంత ధరను సొంతం చేసుకున్నాడు. ముంబై ఇండియన్స్ పోటీ పడి ఇషాన్ కిషన్‌ను 15.25 కోట్ల రూపాయలకు దక్కించుకున్న విషయం తెలిసిందే.
ఇక అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ టాటా ఐపీఎల్ 2022 మెగా వేలం సాగుతోంది. భారీ ధర పలుకుతారనుకున్న క్రికెటర్స్ తక్కువ ధరకే అమ్ముడుపోతున్నారు. ఇక ఏ మాత్రం ఊహించని కొందరు ప్లేయర్సేమో జాక్‌పాట్ ధరను సొంతం చేసుకుంటూ ఆశ్చర్చపరుస్తున్నారు.
కాగా క్రికెట్‌లో వ్యక్తిగతంగా అద్భుతమైన పర్ఫామెన్స్ చూపించిన ఆటగాళ్లంతా మంచి ధరను సొంతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నయా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ భారీ ధర పలికాడు. ఈ టీమిండియా యువ బౌలర్ ప్రారంభ ధర రూ. కోటి కాగా.... పది కోట్ల రూపాయలకు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. మొత్తానికి ప్రసిద్ధ్ కృష్ణకు వేలంలో ఎవరూ ఊహించని ధర పలికాడు.ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో బాగా రాణించడం ప్రసిద్ధ్ కృష్ణకు కలిసొచ్చింది. ఈ సిరీస్‌లో ప్రసిద్ధ్ కృష్ణ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపిక కావడంతో పలు ఫ్రాంచైజీలు అతని కోసం పోటీపడ్డాయి.
రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్రసిద్ధ్ కృష్ణ పోటీ పడగా, చివరికి ఇతన్ని రూ. 10 కోట్లతో రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. అయితే ప్రసిద్ధ్ కృష్ణకు అంత ధర అవసరమా అని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. గత ఐపీఎల్‌లో ప్రసిద్ధ్ కృష్ణను రూ. 20 లక్షలకు కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది.
ఇక ఇటీవలే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ తాజాగా భారత్, వెస్టిండీస్ వన్డే సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబరిచాడు. ప్రాంచైజీలన్నీ టీమిండియా, విండీస్ వన్డే సిరీస్‌లో రాణించిన ఆటగాళ్లపై దృష్టి సారించడం అతనికి కలిసొచ్చింది. ఈ వన్డే సిరీస్‌లో కీలక వికెట్స్ తీశాడు. మొత్తం తొమ్మిది వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
Also Read: Rahul Bajaj: పారిశ్రామిక దిగ్గజం రాహుల్ బజాజ్ కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook