టీ20 ప్రపంచకప్ 2022లో ఇంగ్లండ్ విజయం సాధించి కప్ చేజిక్కించుకుంది. పాకిస్తాన్ జట్టుపై 5 వికెట్ల తేడాతో విజయం నమోదు చేసి..రెండవసారి ప్రపంచకప్ సాధించింది. రెండు సందర్భాల్లోనూ విజయానికి కారణమైన ఇంగ్లండ్ హీరో ఒక్కడే అంటే ఆశ్చర్యంగా ఉందా..
12 జట్ల మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్‌లో తుది విజేతగా ఇంగ్లండ్ గెలిచింది. ఇంగ్లండ్ ఖాతాలో ఇది మూడవ ప్రపంచకప్. టీ20 ఫార్మట్‌లో రెండవది. టీ20 ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ తొలిసారి 2010లో ఆస్ట్రేలియాపై విజయంతో గెల్చుకుంది. సరిగ్గా 12 ఏళ్ల తరువాత ఇప్పుడు 2022లో రెండవసారి టీ20 ప్రపంచకప్ గెల్చుకుంది. 2019లో తొలిసారిగా వన్డే ప్రపంచకప్ సాధించింది. క్రికెట్ పుట్టిన ఇంగ్లండ్..తొలి ప్రపంచకప్ గెల్చుకుంది టీ20 ఫార్మట్‌లోనే. తొలి వన్డే ప్రపంచకప్‌ను 2019లో గెల్చుకుంది.
టీ20 ప్రపంచకప్ 2022లో ఇంగ్లండ్ హీరో
2019లో వన్డే ప్రపంచకప్, 2022లో టీ20 ప్రపంచకప్‌లను గెల్చుకున్న ఇంగ్లండ్ జట్టు విజయానికి కారణమైంది రెండు సందర్భాల్లోనూ ఒకడే కావడం విశేషం. అతడే ఇంగ్లండ్ అల్‌రౌండర్ బెన్‌స్టోక్స్. ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించింది బెన్‌స్టోక్స్‌నే. చివరి వరకూ 52 పరుగులతో నిలిచి జట్టు విజయానికి కారణమయ్యాడు. బౌలింగ్‌లో కూడా కీలకమైన వికెట్లు పడగొట్టాడు. పవర్‌ప్లేలో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఇంగ్లండ్ జట్టును ఆదుకుంది బెన్‌స్టోక్స్‌నే. హ్యారీ బ్రూక్‌తో కలిసి ముఖ్యమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. విన్నింగ్ షాట్ కూడా స్టోక్స్‌దే.
2019 వన్డే ప్రపంచకప్ విజయంలో
ఇంగ్లండ్‌కు చెందిన ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ఇప్పుడే కాదు ఇంగ్లండ్ తొలిసారిగా గెల్చిన వన్డే ప్రపంచకప్ విజయంలో కూడా కారణం బెన్‌స్టోక్స్‌నే. న్యూజిలాండ్‌తో జరిగిన నాటి ఫైనల్ మ్యాచ్‌లో బెన్‌స్టోక్స్ 84 పరుగులతో జట్టు విజయానికి కారణమయ్యాడు. ఈ మ్యాచ్ డ్రా కావడంతో సూపర్ ఓవర్ జరిగింది. సూపర్ ఓవర్ కూడా డ్రా కావడంతో..బౌండరీల కౌంట్ ఆధారంగా ఇంగ్లండ్ జట్టు నాడు విజేతగా నిలిచింది.
అందుకే ఇప్పుడు రెండు ప్రపంచకప్‌ల విజయానికి కారణమైనందుకు బెన్‌స్టోక్స్‌పై సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. సోషల్ మీడియాలో సైతం హీరోగా నిలుస్తున్నాడు.
Also read: T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ 2022 విన్నర్, రన్నర్ సహా ఇండియా, న్యూజిలాండ్ ప్లైజ్‌మనీ ఎంతంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook