Sunil Gavaskar on Babar Azam: టీ 20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశలోనే నిష్క్రమించే స్థాయి నుంచి పాకిస్థాన్ ఏకంగా ఇప్పుడు ఫైనల్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి.. ఫైనల్‌కు బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. ఇంగ్లాండ్‌తో జరిగే చివరి పోరులో అమీతుమీ తేల్చుకోనుంది. 2009లో టీ20 ప్రపంచకప్‌ను పాకిస్థాన్ గెలుచుకోగా.. 2010లో ఇంగ్లండ్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు ఏ జట్టు గెలిచినా.. రెండోసారి పొట్టికప్పును ముద్దాడినట్లు అవుతుంది.
ఆదివారం (నవంబర్ 13)న ప్రతిష్టాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా పాకిస్థాన్, ఇంగ్లాండ్ జట్ల మధ్య టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 1992 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో కూడా పాక్-ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి. అది కూడా ఇదే వేదిపైనే కావడం విశేషం. 30 ఏళ్ల క్రితం MCGలో ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలో 'మెన్ ఇన్ గ్రీన్'తొలి ప్రపంచకప్‌ను గెలుచుకుంది. అప్పుడు ఇంగ్లాండ్‌ను 22 పరుగుల తేడాతో పాక్ ఛాంపియన్‌గా నిలిచింది. మరోసారి ఆ రెండే జట్లు అదే వేదికపై తలపడనుండడం ఆసక్తికరంగా మారింది.
సెంటిమెంట్ ప్రకారం మరోసారి పాకిస్థాన్ విజేతగా నిలుస్తుందని అంచనా వేస్తుండగా.. అలాగే అన్ని సంఘటనలకు లింక్ పెడుతున్నారు. భవిష్యత్‌లో బాబర్ ఆజం పాకిస్థాన్ ప్రధాని అవుతాడంటూ జోస్యం చెబుతున్నారు. 1992 ప్రపంచ ఛాంపియన్ జట్టు కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ 2018లో పాకిస్థాన్ ప్రధాని అయ్యారు. ఈ విషయంపై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందించారు.
అడిలైడ్‌లో భారత్-ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీఫైనల్ ప్రారంభానికి ముందు ఈ లెజెండరీ బ్యాట్స్‌మెన్ ఆ మాట చెప్పారు. గవాస్కర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.'పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ గెలిస్తే 2048లో బాబర్ ఆజం పాకిస్థాన్ ప్రధాని అవుతాడు' అని సునీల్ గవాస్కర్ చెప్పగా.. పక్కన ఉన్న షేన్ వాట్సాన్, మైఖేల్ ఎర్త్‌టన్ పగలపడి నవ్వారు.
Also Read: ED Raids: తెలంగాణలో సోదాలపై ఈడీ కీలక ప్రకటన.. అసలు కారణం ఇదే..!
Also Read: India Chokers: టీమిండియాను చోకర్స్ అని పిలవడంలో తప్పేమీ లేదు.. కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి