శ్రీలంక టీమ్‌తో జరిగిన టీ-20 మ్యాచ్ ద్వితీయార్థంలో బంగ్లాదేశ్ క్రికెటర్లు చేసిన హంగామా స్టేడియంలో ఎంతో సంచలనమైంది. చివరి ఓవర్‌లో అంపైర్లు నోబాల్స్ సరిగ్గా గమనించలేదని బంగ్లాదేశ్ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియంలో రచ్చ చేయడంతో పాటు.. డ్రెస్సింగ్ గదికి వెళ్లి అక్కడి అద్దాలు ధ్వంసం చేశారు. అయితే ఇదే మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం వారు ఈ పని చేయడం గమనార్హం.
ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో బంగ్లాదేశ్ క్రికెటర్లు తీవ్ర విమర్శల పాలయ్యారు. ఇదే వివాదంపై శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య సోషల్ మీడియాలో స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘శ్రీలంకపై విజయం సాధించినా కూడా..ప్రేమదాస స్డేడియంలోని బంగ్లాదేశ్ ఆటగాళ్లు డెస్సింగ్ రూం డోర్ బద్దలుకొట్టారు. థర్డ్ క్లాస్ మనుషులు’’ అని జయసూర్య పలు ఫోటోలతో ట్వీట్ చేశారు. అయితే ఆ తర్వాత ఆ ట్వీట్ పై కూడా విమర్శలు రావడంతో ఆయన వాటిని తొలిగించారు. శ్రీలంకపై 2 వికెట్ల తేడాతో గెలిచిన బంగ్లాదేశ్ టీమ్ నేడు భారత్‌తో ఫైనల్స్‌లో తలపడుతోంది.