RR vs RCB Live Score: శతక్కొట్టిన కోహ్లీ.. రాజస్థాన్ రాయల్స్ ముందు కొండంత లక్ష్యం..

RR vs RCB Live: రాజస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు స్టాండ్స్ లోకి పంపాడు. దీంతో బెంగళూరు జట్టు భారీ స్కోరు సాధించింది.   

Written by - Samala Srinivas | Last Updated : Apr 6, 2024, 10:08 PM IST
RR vs RCB Live Score: శతక్కొట్టిన కోహ్లీ.. రాజస్థాన్ రాయల్స్ ముందు కొండంత లక్ష్యం..

IPL 2024, RR vs RCB Live Score : ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ విధ్వంసం సృష్టించాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు స్టాండ్స్ లోకి పంపాడు. హ్యాట్రిక్ విజ‌యాల‌తో జోరుమీదున్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ బౌలర్లను ఉతికారేశాడు. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ సాధించాడు. ఈ సీజన్ లో ఇదే తొలి శతకం. కోహ్లీ సెంచరీతో ఆర్సీబీ భారీ స్కోరు చేసింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. కెప్టెన్ డూప్లెస‌స్(44) కూడా రాణించాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్(1) మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడు. సౌర‌వ్ చౌహ‌న్ స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. రాజస్థాన్ ఓవర్లలో చాహల్ రెండు వికెట్లు తీశాడు. కోహ్లీ 72 బంతుల్లో 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 113 పరుగులు చేశాడు. 

ఇరు జట్ల ఫ్లేయింగ్ 11 ఇదే..
రాజ‌స్థాన్ రాయల్స్ జ‌ట్టు : య‌శ‌స్వీ జైస్వాల్, జోస్ బ‌ట్ల‌ర్, సంజూ శాంస‌న్(కెప్టెన్), రియాన్ ప‌రాగ్, ధ్రువ్ జురెల్, షిమ్ర‌న్ హెట్‌మైర్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, నంద్రే బ‌ర్గ‌ర్, చాహ‌ల్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డూప్లెసిస్(కెప్టెన్), ర‌జ‌త్ పాటిదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, దినేశ్ కార్తిక్(వికెట్ కీప‌ర్), సౌర‌వ్ చౌహ‌న్, రీసే టాప్లే, మ‌యాంక్ ద‌గ‌ర్, సిరాజ్, య‌శ్ ద‌యాల్.

హెడ్ టు హెడ్ రికార్డు
ఐపీఎల్ పాయింట్ల పట్టికలో రాజస్థాన్ హ్యాట్రిక్ విజయాలతో రెండో స్థానంలో ఉండగా.. బెంగళూరు ఎనిమిదో స్థానంలో ఉంది. రాజస్థాన్, బెంగళూరు జట్లు ఇప్పటి వరకు 30 సార్లు తలపడ్డాయి. ఇందులో బెంగళూరు 15 మ్యాచ్‌లు గెలుపొందగా.. రాజస్థాన్ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. 2020 నుండి ఇరు జట్లు తొమ్మిది సార్లు తలపడగా.. రాజస్థాన్ ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. 

Also Read: IPL 2024: బెంగళూరుతో మ్యాచ్ కు పింక్ జెర్సీలతో బరిలోకి రాజస్థాన్.. కారణం తెలిస్తే సెల్యూట్ చేస్తారు..

Also Read: IPL 2024 Points table: చెన్నైను కొట్టి టాప్-5లోకి సన్ రైజర్స్... అగ్రస్థానం ఎవరిదంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News