ఫైనల్‌ ఫోబియాపై సింధు హాట్ రియాక్షన్

                          

Last Updated : Aug 7, 2018, 12:21 PM IST
ఫైనల్‌ ఫోబియాపై సింధు హాట్ రియాక్షన్

హైదరాబాద్: తనకు ఫైనల్‌ ఫోబియా ఉందని వస్తున్న వార్తలపై తెలుగుతేజం పీవీ సింధు స్పందించింది.  ఫైనల్‌ వరుకు వెళ్లి ఓడిపోయినంత మాత్రానా దీన్ని ఫైనల్ ఫోబియాగానో ..మరోకటి కానో భావించడం పోరపాటని సింధు పేర్కొంది. వాస్తవానికి ఓ క్రీడాకారిణి గట్టి ప్రత్యర్ధులను ఎదుర్కొని ఫైనల్ రావడమనేది గొప్ప విషయమని..ఫైనల్లో ఓడిపోయానని బాధపడేకంటే..  రెండో స్థానం దక్కిందని సంతోషపడటం బెటర్ అని సింధు పేర్కొంది. అయితే తాను బరిలోకి దిగిన ప్రతీసారి గోల్డ్ మెడల్ లక్ష్యంగా ఆడతానని..అది చేధించనంత మాత్రానా నిరాశకు గురికావాల్సిన అవసరం లేదని..భవిష్యత్తు తప్పక గోల్డ్ మెడల్స్ సాధిస్తానని సింధు ఆశాభావం వ్యక్తం చేసింది.

చైనాలో ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో సింధు రజత పతకంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఓలింపిక్స్  సహా అనేక ప్రతిష్ఠాత్మక సిరీస్ లలో ఆమె ఫైనల్ వరకు వెళ్లి ఓడిపోవడంతో.. ఆమెకు ఫైనల్ ఫోబీయా ఉందని వార్తలు వస్తున్నాయి.  రజత పతకం సాధించి తిరిగి  స్వదేశానికి చేరుకున్న సింధు మంగళవారం గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో మీడియాతో మాట్లాడింది. ఈ నేపథ్యంలో  ఫైనల్ ఫోబియాపై ఇలా రియాక్ట్ అయింది.

Trending News