CSK CEO Kasi Viswanath react on MS Dhoni IPL 2023 Captaincy after Ben Stokes Joins: శుక్రవారం కొచ్చిలో జరిగిన ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ సామ్ కరన్‌ను మరోసారి దక్కించుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ప్రయత్నించినా లాభం లేకపోయింది. అయితే మరో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను 16.25 కోట్ల భారీ మొత్తానికి కైవసం చేసుకుంది. వేలంలో మరో నాలుగు ఫ్రాంచైజీలతో పోటీపడి మరీ స్టోక్స్‌ను చెన్నై సొంతం చేసుకుంది. చెన్నై జట్టు కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన ఆటగాడు స్టోక్స్ కావడం విశేషం. ప్రస్తుతం ఇంగ్లండ్ టెస్టు సారథిగా ఉన్న స్టోక్స్.. చెన్నై పగ్గాలు చేపట్టే అవకాశాలున్నట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ ఊహాగానాలపై ఆ జట్టు సీఈఓ కాశీ విశ్వనాథ్ స్పందించారు. 'బెన్ స్టోక్స్‌ని కైవసం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. స్టోక్స్ జట్టులో చేరడంతో మేము కూడా అదృష్టవంతులం అని చెప్పాలి. మేము ముందునుంచి మంచి ఆల్‌రౌండర్‌ని కోరుకున్నాము. స్టోక్స్ జట్టులోకి వచ్చినందుకు ఎంఎస్ ధోనీ చాలా సంతోషంగా ఉన్నాడు. చెన్నై కెప్టెన్సీ విషయం పూర్తిగా మహీ ఇష్టమే. కెప్టెన్సీపై ధోనీనే సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాడు' అని కాశీ విశ్వనాథ్ స్పష్టం చేశారు.
న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ స్కాట్ స్టైరిస్ కూడా చెన్నై కెప్టెన్సీ స్పందించాడు. ఐపీఎల్ 2023లోనే ఎంఎస్ ధోనీ నుంచి బెన్ స్టోక్స్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకోవచ్చని అంచనా వేశాడు. 'బెన్ స్టోక్స్ చెన్నై కెప్టెన్ అవుతాడని నాకు అనిపిస్తోంది. గతేడాది ఎంఎస్ ధోనీ తన కెప్టెన్సీ బాధ్యతలను రవీంద్ర జడేజాకు అప్పగించాడు. ఐపీఎల్ సీజన్ల మధ్యలో మహీ పెద్దగా మ్యాచ్‌లు ఆడట్లేదు. రాబోయే సీజన్‌లోనూ కెప్టెన్సీని అప్పగించేందుకు స్టోక్స్ రూపంలో ధోనీకి అవకాశం ఉంది' అని స్టైరిస్ పేర్కొన్నాడు.
ఐపీఎల్ 2022 ముందు ఎంఎస్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. దీంతో చెన్నై పగ్గాలను స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు అప్పగించారు. అయితే జడేజా సారథ్యంలో చెన్నై ఆశించిన ఫలితాలు అందుకోలేదు. దీంతో సీజన్ మధ్యలో జడేజాను తప్పించి తిరిగి ధోనీనే కెప్టెన్ చేశారు. ఐపీఎల్ 2023 తర్వాత మహీ క్రికెట్ నుంచి తప్పుకుంటాడని తెలుస్తోంది. ఇదే నిజమైతే ఈసారే కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకునే అవకాశం ఉంది.
Also Read: IPL 2023 Auction: అందుకే సామ్ కరన్‌కు రూ. 18.5 కోట్లు వెచ్చించాం: పంజాబ్ కింగ్స్ సహ యజమాని
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.