Suresh Raina: క్రికెటర్ సురేశ్ రైనా మళ్లీ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. అదేమిటీ ఐపీఎల్ మెగా వేలం 2022లో చెన్నై సూపర్ కింగ్స్ సహా మిగతా 9 జట్లలో ఏ టీమ్ కూడా అతడిని కొనలేదు కాదా? మళ్లీ ఐపీఎల్‌లోకి ఎలా వస్తున్నాడు అనుకుంటున్నారు కదా! అయితే ఈసారి ప్లేయర్‌గా కాకుండా కొత్త అవతారంలో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు సురేశ్ రైనా.
ఇక నుంచి రైనా కొత్త అవతారం..
ఐపీఎల్ 2022లో ప్లేయర్‌గా ఆడకపోయినా.. కామెంటేటర్‌గా మారనున్నాడు. ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ మ్యాచ్‌లకు హిందీలో కామెంటేటర్‌గా సురేశ్ రైనా వ్యవహరించనున్నాడు. రవి శాస్త్రితో కలిసి హిందీలో కామెంట్రీ చెప్పనున్నాడు రైనా. ఇప్పటికే రైనాతో స్టార్ స్పోర్ట్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తా సంస్థ దైనిక్ జాగరన్ ఓ కథనం రాసుకొచ్చింది.
రవి శాస్త్రి కూడా 2017 తర్వాత మళ్లీ ఈ ఐపీఎల్ సీజన్‌తోనే కామేంటేటర్‌గా మారనున్నాడు. మొన్నటి వరకు టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా ఉన్న కారణంగా కామెంటేటర్‌గా వ్యవహరించలేదు రవి శాస్త్రీ.
ఐపీఎల్లో సురేశ్ రైనా ప్రస్థానం..
చాలా ఏళ్లుగా సురేశ్ రైనా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. జట్టు 4 సార్లు కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్లో మొత్తం 205 మ్యాచ్‌లు ఆడాడు రైనా. ఇందులో 175 మ్యాచ్‌లు కేవలం చెన్నై తరఫున ఆడటం విశేషం. ఐపీఎల్లో రైనా 5528 పరుగులు చేశాడు. అందుకే రైనాను మిస్టర్ ఐపీఎల్‌గా పిలుస్తుంటారు.
అయితే ఈసారి ఐపీఎల్ మెగా వేలం నిర్వహించగా అందులో తాను చాలా కాలం సేవలందించిన చెన్నై జట్టు సహా ఏ ఇతర టీమ్ కూడా రైనాను కొనుగోలు చేయలేదు. దీనితో అతడు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. దీనితో అతడు కామెంటేటర్‌గా ఇప్పుడు ఐపీఎల్లో తన ప్రస్థానాన్ని సాగించనున్నాడు రైనా.
Also read: IPL 2022: ఐపీఎల్ ప్రారంభానికి ముందే ముంబయి ఇండియన్స్ కు ఎదురుదెబ్బ!
Also read: IPL 2022 New Rules: డీఆర్ఎస్, సూపర్ ఓవర్‌లో కీలక మార్పు.. ఐపీఎల్ 2022 నయా రూల్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Suresh Raina: ఐపీఎల్ 2022లోకి సురేశ్ రైనా- ఈసారి డిఫరెంట్ రోల్లో..
ఐపీఎల్‌లోకి రైనా రీ ఎంట్రీ
ఈసారి కొత్త అవతారంలో..
మెగా వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన సురేశ్ రైనా