MI vs PBKS preview and Predicted Playing XI: ఐపీఎల్ 2022లో భాగంగా ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగనుంది. నేటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. పుణే వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవని మాజీ ఛాంపియన్ ముంబై.. ఈ మ్యాచ్‌లో బోణీ చేస్తుందా లేదా ఐదో ఓటమిని ఖాతాలో వేసుకుంటుందా అని ప్రతిఒక్కరు ఆసక్తిగా చుస్తునారు. మరోవైపు ఆడిన నాలుగు మ్యాచుల్లో రెండు విజయాలు సాధించిన పంజాబ్ ఈ మ్యాచ్ గెలిచి మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది.
ఐపీఎల్ టోర్నీలోనే అత్యధికంగా ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. అలాంటి జట్టు ఈ సీజన్‌లో ఘోరంగా విఫలమవుతోంది. ముంబై భారీ స్కోరు చేయడంలో వైఫల్యం చెందుతోంది. ఒక్కో మ్యాచులో ఒకరిద్దరు మాత్రమే పరుగులు చేయడం ముంబైకి ప్రతికూలంగా మారింది. ఇషాన్ కిషన్ మెరుపులు ఒక మ్యాచుకే పరిమితం కాగా.. రోహిత్ శర్మ తనస్థాయి ఆట ఇప్పటివరకు ఆడలేదు. డెవాల్డ్ బ్రెవిస్, తిలక్ వర్మ ఫామ్ కాస్త సంతోషించాల్సిన విషయం. ఇప్పటికైనాటాప్ ఆర్డర్ కలిసికట్టుగా ఆడితే భారీ సాకర్ చేసే అవకాశం ఉంది.
ఆరంభ మ్యాచులకు దూరమైన సూర్యకుమార్ యాదవ్ గత మ్యాచులో మెరిశాడు. ఇక ముంబై నమ్ముకున్న హార్డ్ హిట్టర్ కీరన్ పోలార్డ్ ఇప్పటివరకు ఆశించిన మేర ఆడలేదు. ఒక్క మ్యాచులో కూడా పోలీ పరుగులు చేయలేదు. ఇప్పటికైనా అతడు పరుగులు చేయాలని ముంబై ఫాన్స్ కోరుకుంటున్నారు. అటు బౌలింగ్ భారం మొత్తం జస్ప్రీత్ బుమ్రాపైనే పడుతోంది. ట్రెంట్ బౌల్ట్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. జయదేవ్ ఉనద్కత్, టైమల్ మిల్స్, బాసిల్ థంపి భారీగా పరుగులు ఇవ్వడంతో జట్టు విజయంపై ప్రభావం చూపిస్తోంది. సమిష్టిగా రాణిస్తేనే ముంబై విజయాన్ని అందుకుంటుంది.
పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా ఉంది. మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, జానీ బెయిర్‌స్టో, జితేష్ శర్మ, షారుక్ ఖాన్, ఒడియన్ స్మిత్‌లతో చాలా పటిష్టంగా ఉంది. అందరూ కూడా ఫామ్ మీదున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో కాగిసో రబడా, రాహుల్ చహర్, వైభవ్ అరోరా, హర్షదీప్ సింగ్ లాంటి మంచి లైనప్ ఉంది. ఫామ్‌లో ఉన్న పంజాబ్‌ను ముంబై ఓడిస్తుందా లేక మరో ఓటమి మూటగట్టుకుంటుందా వేచిచూడాలి. ఐపీఎల్ టోర్నీలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 27 మ్యాచుల్లో తలపడగా.. ముంబై 14 మ్యాచుల్లో, పంజాబ్ 13 మ్యాచుల్లో గెలిచింది.
తుది జట్లు:
పంజాబ్: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, షారుక్ ఖాన్, ఒడియన్ స్మిత్, కగిసో రబడా, రాహుల్ చహర్, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ అరోరా.
ముంబై: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ (కెప్టెన్), డెవాల్డ్ బ్రీవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, ఫాబియన్ అలెన్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, జయదేవ్ ఉనద్కత్, బాసిల్ థంపి.
Also Read: Summer Fruits: మండు వేసవిలో ఈ పండ్లను తీసుకుంటే.. మీ బాడీ అస్సలే డీహైడ్రేషన్ కాదు!
Also Read: Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బ్యాడ్ న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ దూరం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook