Jos Buttler Fined: జైస్వాల్‌ కోసం బట్లర్ వికెట్ త్యాగం.. మ్యాచ్‌లో ఫీజులో 10 శాతం ఫైన్

KKR Vs RR IPL 2023 Highlights: జోస్ బట్లర్‌కు మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోతపడింది. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కోసం వికెట్ త్యాగం చేసిన బట్లర్‌.. రనౌట్ రూపంలో డకౌట్ అయ్యాడు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం లెవెల్ 1 నేరాన్ని బట్లర్ ఉల్లంఘించినట్లు బీసీసీఐ వెల్లడించింది.   

Written by - Ashok Krindinti | Last Updated : May 12, 2023, 01:24 PM IST
Jos Buttler Fined: జైస్వాల్‌ కోసం బట్లర్ వికెట్ త్యాగం.. మ్యాచ్‌లో ఫీజులో 10 శాతం ఫైన్

KKR Vs RR IPL 2023 Highlights: ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఐపీఎల్‌ చరిత్రలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. కానీ అంతకుముందు జోస్ బట్లర్ తన వికెట్ త్యాగం చేయడంతోనే జైస్వాల్‌కు ఈ రికార్డు సాధ్యమైంది. మూడు బంతులు ఎదుర్కొన్న బట్లర్ పరుగులేమి చేయకుండా.. రనౌట్ రూపంలో ఔట్ అయ్యాడు. జైస్వాల్‌ కోసం వికెట్ త్యాగం చేసిన బట్లర్‌.. జరిమానాకు గురయ్యాడు. లెవల్ 1 నేరం కింద ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ బట్లర్ మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించింది.

హర్షిత్ రానా వేసిన రెండో ఓవర్ నాలుగో బంతిని బట్లర్ పాయింట్ దిశగా షాట్ ఆడాడు. రన్ కోసం కొంచెం ముందుకు వెళ్లి ఆగిపోగా.. జైస్వాల్ అప్పటికే బట్లర్ దగ్గరకు వచ్చేశాడు. దీంతో బట్లర్ వెనక్కి వెళ్లాలని అనుకున్నా.. జైస్వాల్ కోసం ముందుకు పరిగెత్తాడు. తాను ఔట్ అవుతానని తెలిసినా.. బౌలర్ ఎండ్‌ వైపు వెళ్లాడు. అప్పటికే బాల్ అందుకున్న ఆండ్రీ రస్సెల్ డైరెక్ట్ హిట్‌తో వికెట్లను పడగొట్టాడు. దీంతో బట్లర్ డకౌట్ అయ్యాడు. అనంతరం జైస్వాల్ 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేయగా.. డగౌట్‌ నుంచి బట్లర్ సంబరాలు చేసుకున్నాడు. అయితే ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు జోస్ బట్లర్‌కు అతని మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధిస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.

'ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం లెవెల్ 1 నేరాన్ని బట్లర్ అంగీకరించాడు. ప్రవర్తనా నియమావళి లెవల్ 1 ఉల్లంఘనలకు మ్యాచ్ రిఫరీ నిర్ణయమే ఫైనల్. రిఫరీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. బట్లర్‌పై 10 శాతం జరిమానా విధించా..' అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. జైస్వాల్ కోసం బట్లర్ వంటి సీనియర్ ఆటగాడు తన వికెట్‌ను త్యాగం చేయడంపై రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ప్రశంసల వర్షం కురిపించాడు. తమ జట్టు స్పిరిట్‌కు ఇదే నిదర్శమన్నాడు. జట్టులో వాతావరణం చాలా చక్కగా ఉందని అన్నాడు.

మ్యాచ్‌ అనంతరం జైస్వాల్ మాట్లాడుతూ.. బట్లర్ ఔట్ అయిన తరువాత తాను మరింత బాధ్యతతో ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. తనపై ఎలాంటి ఒత్తిడి పడకుండా ఉండేందుకు శాంసన్ ఆత్మవిశ్వాసాన్ని నింపాడని తెలిపాడు."అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది. ఎవరూ ఉద్దేశపూర్వకంగా చేయరు. కంగారు పడకు. నీ ఆటను నువ్వు ఆడు.. అని సంజూ భాయ్ చెప్పాడు. గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడేందుకు ఐపీఎల్ యువకులకు గొప్ప అవకాశం కల్పించింది' అని జైస్వాల్ తెలిపాడు. 

గత సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచిన బట్లర్‌కు ఈ సీజన్‌లో బట్లర్‌కి ఇది మూడో డక్. బట్లర్ సహచరుడు యశస్వి జైస్వాల్ ఇప్పటికే ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కంటే కేవలం ఒక పరుగు వెనుకబడి ఉన్నాడు. జైస్వాల్ ఇప్పటివరకు 12 మ్యాచ్‌లలో 575 పరుగులు చేయగా.. డుప్లెసిస్ 576 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు.

Also Read: Indian Railway Facts: ఆర్ఏసీ ప్రయాణికులకు కూడా అన్ని సౌకర్యాలు ఉంటాయా..? ఈ విషయాలు తెలుసుకోండి 

Also Read: MI vs GT Dream11 Team Prediction: గుజరాత్‌పై ముంబై ప్రతీకారం తీర్చుకుంటుందా..? పిచ్ రిపోర్ట్.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News