Sandeep Sharma Replaced Prasidh Krishna: ఐపీఎల్ 2023 మార్చి 31 నుంచి ప్రారంభం కానుండగా.. దాదాపు అన్ని జట్లు గాయల బెడదతో ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పటికే గాయపడిన ఆటగాళ్ల స్థానంలో అన్ని జట్లు ఇతర ప్లేయర్లను తీసుకుంటున్నాయి. రాజస్థాన్ రాయల్స్ స్పీడ్ స్టార్ ప్రసిద్ధ్ కృష్ణ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమవ్వగా.. అతని స్థానంలో సందీప్ శర్మను జట్టులోకి తీసుకున్నట్లు జట్టు ప్రకటించింది. గతేడాది నిర్వహించిన వేలంలో సందీప్ శర్మ అమ్ముడుపోలేదు. మరోసారి ఈ బౌలర్‌ను అదృష్టం వరించింది.
సందీప్ శర్మ ఐపీఎల్ కెరీర్‌ను పరిశీలిస్తే.. రికార్డు అద్భుతంగా ఉంది. ఐపీఎల్‌లో మొత్తం 104 మ్యాచ్‌లు ఆడగా.. 114 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో సందీప్ శర్మ స్ట్రైక్ రేట్ 20.33 కాగా సగటు 26.33. ఐపీఎల్‌లో 100 పైగా వికెట్లు తీసిన కొద్దిమంది బౌలర్లలో సందీప్ శర్మ ఒకడు. అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 20 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్ తర్వాత పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సందీప్ శర్మ నిలిచాడు. 2014 నుంచి 2020 వరకు ప్రతి సీజన్‌లో 12 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఏకైక బౌలర్ సందీప్ శర్మ. సందీప్ శర్మ గతేడాది పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు. అతని ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. 5 మ్యాచ్‌లు ఆడిన సందీప్ శర్మ కేవలం 2 వికెట్లు మాత్రమే తీశాడు.
ఐపీఎల్‌లో అత్యధిక సార్లు విరాట్ కోహ్లీని అవుట్ చేసిన రికార్డు సందీప్ శర్మ పేరిటే ఉంది. ఏడుసార్లు కోహ్లీని పెవిలియన్‌కు పంపించాడు. ఐపీఎల్ 2023 వేలంలో సందీప్ శర్మ బేస్ ధర రూ.50 లక్షలు మాత్రమే అయినా.. ఏ జట్టు కూడా కొనుగోలు చేయలేదు. ఈ సీజన్ రాజస్థాన్ రాయల్స్ తరఫున అనూహ్యంగా చోటు దక్కించుకున్న సందీప్ శర్మ.. ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
సందీప్ శర్మకు టీమిండియా తరఫున కూడా ఆడే అవకాశం లభించింది. భారత్ తరఫున రెండు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2015లో హరారేలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సందీప్ శర్మ టీమ్ ఇండియా తరపున తన T20 అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించాడు. ఈ సిరీస్‌లో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడిన సందీప్ శర్మకు మళ్లీ టీమ్ ఇండియాలో ఆడే అవకాశం రాలేదు. ఈ 2 మ్యాచ్‌ల్లో అతనికి ఒక్క వికెట్ మాత్రమే దక్కింది.
Also Read: BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్ గ్రేడ్స్ ప్రకటన.. పాండ్యా, జడేజాకు ప్రమోషన్.. ఈ ప్లేయర్లు ఔట్..!
Also Read: Aha New CEO: ఆహా కీలక నిర్ణయం.. కొత్త సీఈఓ నియామకం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి