IPL 2024 Schedule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 వేలానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ మరి కాస్సేపట్లో దుబాయ్ వేదికగా ఆటగాళ్ల వేలం జరగనుంది. మరోవైపు ఐపీఎల్ టోర్నీ మార్చ్ 22 నుంచి ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. ఎన్నికల సమయం కావడంతో నోటిఫికేషన్ తరువాత తుది షెడ్యూల్ నిర్ధారణ కానుంది.
ఐపీఎల్ 2024 వేలం మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. మొత్తం పది ఫ్రాంచైజీలు దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో జరిగే వేలంలో పాల్గొననున్నాయి. ఇప్పటికే మొత్తం 77 స్లాట్ల కోసం 333 మంది ఆటగాళ్లు పోటీ పడనున్నారు. ఇందులో 214 మంది భారతీయ ఆటగాళ్లుంటే 119 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. ఒక్కొక్కరి బేస్ ప్రైస్ ఒక్కోలా ఉంది. వ్యాలెట్ అత్యధికంగా కలిగి ఉన్న గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్‌కింగ్స్ జట్లు కీలక ఆటగాళ్ల కోసం ఎంతవరకైనా వెళ్లే అవకాశముంది. ముఖ్యంగా మిచెల్ స్టార్క్, గెరాల్డ్ కోయెట్జీ, పాట్ కమిన్స్, ట్రేవిస్ హెడ్, రచిన్ రవీంద్రలపై అందరి దృష్టీ ఉంది. ఇవాల జరగనున్న వేలంలో ఈ ఆటగాళ్లు భారీ దర పలికే అవకాశాలున్నాయి.
అయితే ఇవాళ వేలం ప్రక్రియ పూర్తయి ఏ టీమ్‌కు ఎవరెవరనేది తేలిపోనుంది. మరి టోర్నీ ఎప్పుడు ప్రారంభమౌతుందనే సందేహాలకు కూడా దాదాపు స్పష్టత వచ్చేసింది. ఐపీఎల్ 2024 సీజన్ 17 మార్చ్ 22 నుంచి ప్రారంభించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఐపీఎల్ రెండు నెలలు జరగనుంది. అయితే అదే సమయంలో దేశంలో సార్వత్రిక ఎన్నికలుండటంతో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత ఐపీఎల్ తుది షెడ్యూల్ విడుదల చేయనున్నారు. పోలింగ్ తేదీలు ఖరారైన తరువాత ఐపీఎల్ టోర్నీ ఎప్పుడనేది తేలనుంది.
Also read: Ind vs SA: ఇండియా దక్షిణాఫ్రికా రెండవ వన్డే, సిరీస్ విజయంపై కన్నేసిన భారత్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook